వరుసగా మూడు రోజుల నుంచీ బంగారం డౌన్‌ | Gold to jump $200 by end of the year, Bank of America says | Sakshi
Sakshi News home page

వరుసగా మూడు రోజుల నుంచీ బంగారం డౌన్‌

Published Fri, Mar 10 2017 1:15 AM | Last Updated on Tue, Sep 5 2017 5:38 AM

వరుసగా మూడు రోజుల నుంచీ బంగారం డౌన్‌

వరుసగా మూడు రోజుల నుంచీ బంగారం డౌన్‌

ఐదు వారాల కనిష్టానికి పతనం
ముంబై: డాలర్‌ బలోపేతం, అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌ వడ్డీరేట్ల పెంపు అవకాశాల వార్త నేపథ్యంలో పసిడి అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్‌ నైమెక్స్‌లో ఔన్స్‌ ధర ఫిబ్రవరి 1 స్థాయికి చేరింది. కడపటి సమాచారం అందే సరికి ఔన్స్‌ (31.1గ్రా)కు 1,200 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గడచిన 10 రోజుల్లో పసిడి దాదాపు 45 డాలర్లు తగ్గింది. దేశీయంగానూ ఇదే ధోరణి కనబడుతోంది.

ముంబై ప్రధాన స్పాట్‌ మార్కెట్‌లో వరుసగా 5 రోజులుగా పసిడి పడు తోంది. 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.205 తగ్గి రూ.28,790 వద్ద ముగిసింది. 99.5 స్వచ్ఛత ధర సైతం ఇదే స్థాయిలో తగ్గి 28,640 వద్ద ట్రేడవుతోంది. కాగా వెండి కేజీ ధర రూ.525 తగ్గి రూ.41,775కు చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement