
గోల్డ్ ప్లస్ నుంచి బృందావన్ కలెక్షన్
హైదరాబాద్: టాటా గ్రూప్‌కు చెందిన ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ ‘గోల్డ్‌ప్లస్’ తాజాగా ‘బృందావన్.. ద గార్డెన్ ఆఫ్ జువెల్స్’ అనే కలెక్షన్‌ను ఆవిష్కరించింది. జీవితంలో నూతనత్వం కోరుకునే ప్రతి సందర్భంలో వినూత్నమైన ఆభరణాలను ధరించాలని తలచే మహిళల కోసం ప్రత్యేకంగా ఈ కలెక్షన్‌ను డిజై న్ చేశామని టైటాన్ కంపెనీ జువెలరీ డివిజన్ మార్కెటింగ్ విభాగపు జనరల్ మేనేజర్ దీపికా తివారీ పేర్కొన్నారు. స్వచ్ఛతకు మారుపేరుగా నిలిచే గోల్డ్‌ప్లస్ అందిస్తున్న బృందావన్ కలెక్షన్‌లో అద్భుతమైన ఆభరణాలు ఉన్నాయని నటి తాప్సీ తెలిపారు.