జీఎస్టీ సేల్: ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్ | Great GST sale: It's raining discounts as electronics retailers clear stock | Sakshi
Sakshi News home page

జీఎస్టీ సేల్: ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్

Published Sat, Jun 3 2017 4:25 PM | Last Updated on Tue, Aug 14 2018 4:01 PM

జీఎస్టీ సేల్: ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్ - Sakshi

జీఎస్టీ సేల్: ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్

కొత్త టీవీని, వాషింగ్ మిషిన్ ను, రిఫ్రిజిరేటర్ ను లేదా ఎయిర్ కండీషనర్ ను కొనాలుకుంటున్నారా? అయితే సరియైన సమయమట. ఎందుకంటే దేశంలో కొత్తగా అమలు కాబోతున్న జీఎస్టీ కంటే ముందుగా అంటే ఇంకా ఒకనెలలో స్టాక్స్ అంతటిన్నీ లిక్విడిటీ(నగదు)లోకి మార్చుకోవాలని రిటైలర్లు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్, కన్జ్యూమర్ డ్యూరెబుల్స్ పై రిటైలర్లు భారీగా డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించారు. జూన్ నెలలో 25 శాతం నుంచి 30 శాతం డిస్కౌంట్లను ఎలక్ట్రానిక్స్ వస్తువులపై ఆఫర్ చేయడం ఇదే మొదటి సారని విజయ్ సేల్స్ ఎండీ నీలేష్ గుప్తా చెప్పారు. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్-కండీషనర్లు అన్నింటిపైన రిటైలర్లు డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నామని, వీటిని  ఇతర కేటగిరీ వస్తువులు టీవీలు, వాషింగ్ మిషిన్లకు కూడా విస్తరించనున్నట్టు పేర్కొన్నారు. 
 
ఏసీలు, రిఫ్రిజిరేటర్లు వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు జూన్ చాలా బలహీనమైన నెలగా ఉంటుంది. మే లోనే అన్ని కొనుగోలులు అయిపోతాయి. కానీ ఈ  ఏడాది ఏప్రిల్ తో పోలిస్తే మే నెలలో ఏసీలు, రిఫ్రిజిరేటర్ల విక్రయ వృద్ధి చాలా తక్కువగా ఉందని మార్కెట్ వర్గాలు చెప్పాయి.  ఏప్రిల్ నెలలో విక్రయ వృద్ధి 15-20 శాతముంటే, మే నెలలో 8-10 శాతం మాత్రమే నమోదైందని పేర్కొన్నాయి. వేసవి కాలానికి జూన్ నెల చివరిదని, మే నెలలోనే చాలా తక్కువ అమ్మకాలు నమోదయ్యాయని, ప్రస్తుతం జీఎస్టీ అమల్లోకి వచ్చే లోపల పాత స్టాక్ అంతటిన్నీ విక్రయించాలని నిర్ణయించినట్టు కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్ నిపుణుడు వైవీ వెర్మ చెప్పారు. జీఎస్టీ కింద ఏ మేర లాభాలు వస్తాయి, ఏ మేర నష్టాలు వస్తాయో సరియైన క్లారిటీ లేకపోవడంతో ఈ డిస్కౌంట్ రన్ ప్రారంభించినట్టు తెలుస్తోంది. జూన్ 3 నుంచే చాలా మంది రిటైలర్లు ఈ కన్జ్యూమర్ ఆఫర్లను ప్రారంభిస్తున్నారని తెలిసింది.    
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement