electronics retailers
-
‘క్రోమా’ వింటర్ సీజన్ సేల్..బంపర్ ఆఫర్లు
హైదరాబాద్: టాటా గ్రూపు ఎలక్ట్రానిక్స్ రిటైల్ కంపెనీ ‘క్రోమా’ వింటర్ సీజన్ ఆఫర్లను ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, బ్లూటూత్ స్పీకర్లు, ఏసీలు, పవర్ బ్యాంక్‌లు, ఎయిర్ ప్యూరిఫయర్లపై ఆకర్షణీయమైన డీల్స్‌ను అందిస్తున్నట్టు తెలిపింది. అన్ని క్రోమా స్టోర్లు, క్రోమా ఆన్లైన్ పోర్టల్‌లో కొనుగోళ్లపై ఈ ఆఫర్లను పొందొచ్చని పేర్కొంది. బ్యాక్ ప్యాక్‌లపై 70 శాతం వరకు, ఇయర్ ఫోన్లపై 80 శాతం వరకు రాయితీ, నెక్ పిల్లో, ఐమాస్కస్, ట్రావెల్ బ్యాగ్ వంటి ట్రావెల్ యాక్సెసరీలపై 5 శాతం రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించింది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై అదనంగా 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుందని తెలిపింది. (గుడ్‌న్యూస్..ఈ ఐటీ కంపెనీలో కొలువులే కొలువులు) రూం హీటర్లు కేవలం 699తో ప్రారంభం. ఇన్స్టంట్ గీజర్లు ధరలు 799 నుండి ప్రారంభం. ఫిలిప్స్ ఎయిర్ఫ్రైయర్స్, కెటిల్స్ , కన్వెక్షన్ మైక్రోవేవ్ తదితర వింటర్ సీజన్‌కు సంబంధించిన ఉత్పత్తులపై ఆఫర్లను అందిస్తోంది. -
జీఎస్టీ సేల్: ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్
కొత్త టీవీని, వాషింగ్ మిషిన్ ను, రిఫ్రిజిరేటర్ ను లేదా ఎయిర్ కండీషనర్ ను కొనాలుకుంటున్నారా? అయితే సరియైన సమయమట. ఎందుకంటే దేశంలో కొత్తగా అమలు కాబోతున్న జీఎస్టీ కంటే ముందుగా అంటే ఇంకా ఒకనెలలో స్టాక్స్ అంతటిన్నీ లిక్విడిటీ(నగదు)లోకి మార్చుకోవాలని రిటైలర్లు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్, కన్జ్యూమర్ డ్యూరెబుల్స్ పై రిటైలర్లు భారీగా డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించారు. జూన్ నెలలో 25 శాతం నుంచి 30 శాతం డిస్కౌంట్లను ఎలక్ట్రానిక్స్ వస్తువులపై ఆఫర్ చేయడం ఇదే మొదటి సారని విజయ్ సేల్స్ ఎండీ నీలేష్ గుప్తా చెప్పారు. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్-కండీషనర్లు అన్నింటిపైన రిటైలర్లు డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నామని, వీటిని ఇతర కేటగిరీ వస్తువులు టీవీలు, వాషింగ్ మిషిన్లకు కూడా విస్తరించనున్నట్టు పేర్కొన్నారు. ఏసీలు, రిఫ్రిజిరేటర్లు వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు జూన్ చాలా బలహీనమైన నెలగా ఉంటుంది. మే లోనే అన్ని కొనుగోలులు అయిపోతాయి. కానీ ఈ ఏడాది ఏప్రిల్ తో పోలిస్తే మే నెలలో ఏసీలు, రిఫ్రిజిరేటర్ల విక్రయ వృద్ధి చాలా తక్కువగా ఉందని మార్కెట్ వర్గాలు చెప్పాయి. ఏప్రిల్ నెలలో విక్రయ వృద్ధి 15-20 శాతముంటే, మే నెలలో 8-10 శాతం మాత్రమే నమోదైందని పేర్కొన్నాయి. వేసవి కాలానికి జూన్ నెల చివరిదని, మే నెలలోనే చాలా తక్కువ అమ్మకాలు నమోదయ్యాయని, ప్రస్తుతం జీఎస్టీ అమల్లోకి వచ్చే లోపల పాత స్టాక్ అంతటిన్నీ విక్రయించాలని నిర్ణయించినట్టు కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్ నిపుణుడు వైవీ వెర్మ చెప్పారు. జీఎస్టీ కింద ఏ మేర లాభాలు వస్తాయి, ఏ మేర నష్టాలు వస్తాయో సరియైన క్లారిటీ లేకపోవడంతో ఈ డిస్కౌంట్ రన్ ప్రారంభించినట్టు తెలుస్తోంది. జూన్ 3 నుంచే చాలా మంది రిటైలర్లు ఈ కన్జ్యూమర్ ఆఫర్లను ప్రారంభిస్తున్నారని తెలిసింది.