ఆన్‌లైన్‌ నియామకాల్లో జోరు | Growth in online recruitment | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ నియామకాల్లో జోరు

Published Wed, Oct 25 2017 12:30 AM | Last Updated on Wed, Oct 25 2017 3:06 AM

Growth in online recruitment

న్యూఢిల్లీ:న్‌లైన్‌ నియామకాల్లో పెరుగుదల చోటు చేసుకుంది. వార్షిక ప్రాతిపదికన సెప్టెంబర్‌లో 3 శాతం వృద్ధి నమోదయ్యింది. నౌకరీ జాబ్‌ స్పీక్‌ ఇండెక్స్‌ ఈ నెలలో 3 శాతం వృద్ధితో 1,948కు చేరింది. బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ విభాగంలోని నియామకాలు ఏకంగా 21 శాతం పెరగ్గా, భారీ యంత్ర పరికరాలు, ఇంజనీరింగ్, ఆటో విభాగాల్లోని నియామకాల్లోనూ వరుసగా 19 శాతం, 15 శాతం, 7 శాతం చొప్పున వృద్ధి నమోదైంది.

అయితే ఆయిల్‌ అండ్‌ గ్యాస్, బీపీవో/ఐటీఈఎస్, ఇన్సూరెన్స్, ఐటీ–సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో మాత్రం తగ్గుముఖం  పట్టాయి. ఈ రంగాల్లో వరుసగా 4 శాతం, 6 శాతం, 9 శాతం, 6 శాతం చొప్పున క్షీణత నమోదైంది. ఇక దేశవ్యాప్తంగా 13 ప్రధాన నగరాలకు గాను 12 నగరాల్లో నియామకాలు పెరిగాయి. ముంబై, కోల్‌కతాలోని నియామకాల్లో 15 శాతం చొప్పున వృద్ధి కనిపించింది. ఢిల్లీ/ఎన్‌సీఆర్‌లోని నియామకాలు మాత్రం 9 శాతం క్షీణించాయి.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement