Online Appointments
-
We Care for You: వాట్సాప్ సర్వీస్ ద్వారా శాంసంగ్ బెనిఫిట్స్
న్యూఢిల్లీ: కస్టమర్ల సేఫ్టీ కోసం శాంసంగ్ సులువైన సౌకర్యాన్ని తీసుకొచ్చింది. కరోనా టైంలో షోరూమ్‌ల దగ్గర కస్టమర్ల క్యూ తాకిడిని తగ్గించేందుకు వీ కేర్ ప్రొగ్రాం కింద ఓ ఫీచర్‌ను తెచ్చింది. దాని పేరు ‘షాప్ బై అపాయింట్మెంట్’. శాంసంగ్ ప్రొడక్ట్స్ ఏవైనా కొనాలంటే ఇకపై కస్టమర్లు షోరూమ్ దగ్గర వేచిచూడాల్సిన అవసరం లేకుండా.. ముందుగా ఆన్లైన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ముందుగా శాంసంగ్ షాప్ బై అపాయింట్మెంట్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని ప్రకారం.. కస్టమర్లకు దగ్గర్లో ఉన్న శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్‌లో ఫలానా తేదీ, ఫలానా టైంకి అపాయింట్మెంట్ ఇస్తారు. అంతేకాదు శాంసంగ్ స్మార్ట్ కేఫ్‌లలో అపాయింట్మెంట్ కోసం 9870494949 నెంబర్‌కు వాట్సాప్ చేసి.. కొన్ని స్టెప్స్ ఫాలో కావాలి. ఆ తర్వాత వాళ్లు అపాయింట్మెంట్ ఇచ్చే టైంకి షోరూంకి వెళ్లి.. ఎగ్జిక్యూటివ్‌తో నేరుగా ఇంటెరాక్ట్ అయ్యి కావాల్సిన ప్రొడక్ట్ గురించి తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా కస్టమర్ల మధ్య ఫిజికల్ డిస్టెన్స్ తేలికగా అమలు అవుతుందని కంపెనీ భావిస్తోంది. ఈ వాట్సాప్ చాట్‌బోట్ ద్వారా డివైజ్‌ల వివరాలు, లేటెస్ట్ ఆఫర్లు, దగ్గర్లోని స్టోర్ల వివరాలు తెలుసుకోవచ్చు. హోం డెలివరీ, హోం డెమో సర్వీసులను కస్టమర్లు అందుకోవచ్చు. అవసరమైన చెల్లింపులను డిజిటల్ పే ద్వారా చేయొచ్చు. ఈ-ఇన్వాయిస్లను వాట్సాప్ ద్వారానే పొందవచ్చు. ఇక ఈ సర్వీస్‌ల ద్వారా ప్రొడక్టులను కొనే కస్టమర్లకు 1000 రూ. దాకా రివార్డు పాయింట్లు ఇస్తారు. ఈ పాయింట్లు శాంసంగ్ స్మార్ట్ క్లబ్ వాలెట్లో జమ అవుతుంది. ఈ సర్వీస్ ద్వారా గేలక్సీ ట్యాబ్స్, స్మార్ట్ వాచీలు, బడ్స్ మీద స్టూడెంట్స్‌కి స్పెషల్ డిస్కౌంట్ లభించనుంది. వీటితోపాటు అదనంగా రిఫరెల్ అడ్వాంటేజ్ ప్రోగ్రాం కింద ఆఫర్లు వర్తించే ఫోన్లపై రూ. 7500 రిఫరల్ బెనిఫిట్(రిఫరెన్స్ చేయడం ద్వారా) కస్టమర్లకు దక్కుతుంది. చదవండి: వాట్సప్ సమస్యలపై గ్రీవెన్స్ ఆఫీసర్‌కి కంప్లైంట్ చేయడం ఎలా? -
పెరుగుతున్న ఆన్లైన్ నియామకాలు
న్యూఢిల్లీ: ఇటీవలి సంస్కరణలకు అనుగుణంగా ఆర్థిక వ్యవస్థ సర్దుకుంటున్న నేపథ్యంలో ఆన్లైన్ నియామకాలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. ఏప్రిల్‌లో ఆన్లైన్ హైరింగ్ 11 శాతం పెరిగింది. ముఖ్యంగా ఉత్పత్తి, తయారీ రంగాల్లో ఇది అత్యధిక స్థాయిలో ఉంది. ఆన్లైన్ రిక్రూట్మెంట్ సేవల సంస్థ ‘మాన్‌స్టర్‌డాట్‌కామ్’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఉద్యోగాల కల్పనకు సంబంధించి సంస్థ నిర్వహించే మాన్స్టర్ ఎంప్లాయ్మెంట్ సూచీ గతేడాది ఏప్రిల్‌లో 268 పాయింట్లుగా ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో 11 శాతం వృద్ధితో 298కి చేరింది. సూచీలోని మొత్తం 27 పరిశ్రమల్లో గతేడాదితో పోలిస్తే 21 రంగాల్లో ఆన్లైన్ డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఉత్పత్తి, తయారీ రంగాల్లో అత్యధికంగా 54 శాతం మేర దీర్ఘకాలిక వృద్ధి నమోదైంది. ఈ ఏడాది మార్చిలో నమోదైన 47 శాతంతో పోలిస్తే మరో ఏడు పాయింట్లు పెరిగింది. ఇక గృహోపకరణాల రంగం 45 శాతం వార్షిక వృద్ధితో రెండో స్థానంలో నిల్చింది. హెల్త్‌కేర్, ఫైనాన్స్.. అండ్ అకౌంట్స్ మొదలైన విభాగాల్లో నియామకాలు మెరుగుపడ్డాయి. ఇటీవలి సంస్కరణలకు ఎకానమీ సానుకూల ధోరణిలో సర్దుకుంటోందని, ఆన్లైన్ హైరింగ్ మెరుగవుతోందని మాన్‌స్టర్‌డాట్‌కామ్ (ఏపీఏసీ, గల్ఫ్) సీఈవో అభిజిత్ ముఖర్జీ తెలిపారు. పీఎస్‌యూల్లో తగ్గుదల.. పరిశ్రమలన్నింటిలోనూ అత్యధికంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్‌యూ), రక్షణ రంగంలో రిక్రూట్మెంట్ 34 శాతం మేర క్షీణించింది. ఇక బీపీవో/ఐటీఈఎస్ రంగంలోనూ అవకాశాలు అంతంతమాత్రంగానే వచ్చాయి. అయితే, క్షీణతకు మాత్రం కొంత అడ్డుకట్టపడింది. ఆన్లైన్ నియామకాల పెరుగుదల 24 శాతం మేర క్షీణించగా, ఏప్రిల్‌లో 16 శాతానికి పరిమితమైంది. టెలికం రంగంలో విలీనాలు, కొనుగోళ్లతో నియామకాల విషయంలో కొంత ఆచి తూచి వ్యవహరించే పరిస్థితి నెలకొందని ముఖర్జీ పేర్కొన్నారు. కంపెనీలు ప్రస్తుతం తమ వద్ద ఉన్న ఉద్యోగులను సుశిక్షితులుగా తీర్చిదిద్దుకోవాల్సి ఉండగా, ఉద్యోగార్థులు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంపై దృష్టి సారించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ముంబైలో 15 శాతం అప్.. ఆన్లైన్ నియామకాల్లో నగరాలవారీగా చూస్తే ప్రధమ శ్రేణి నగరాల్లో ముంబై ఒక్కటే రెండంకెల స్థాయిలో 15 శాతం వృద్ధి నమోదు చేసింది. మార్చితో పోలిస్తే ఒక్క శాతం అధికంగా హైదరాబాద్‌లో 9 శాతం వృద్ధి నమోదైంది. అటు చెన్నైలో రెండు శాతం పెరిగి 9 శాతానికి చేరింది. జైపూర్‌లో అత్యధికంగా 28 శాతం, చండీగఢ్.. కొచ్చిలో 24 శాతం వృద్ధి నమోదైంది. -
ఆన్లైన్ నియామకాలు అప్
న్యూఢిల్లీ: ఆన్లైన్ నియామకాలు పెరిగాయి. ఫిబ్రవరి నెలలో 6 శాతం వృద్ధి నమోదయ్యింది. నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ ఫిబ్రవరిలో 2,087 వద్ద నిలిచింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఇండెక్స్‌లో 6 శాతం వృద్ధి కనిపించింది. ‘జాబ్ స్పీక్ ఇండెక్స్‌లో వార్షిక ప్రాతిపదికన 6 శాతం వృద్ధి నమోదయ్యింది. దీనికి నాన్–ఐటీ రంగాలైన అయిల్ అండ్ గ్యాస్, బీఎఫ్ఎస్ఐ, ఇన్సూరెన్స్, ఇండస్ట్రీయల్ ప్రొడక్టŠస్, కన్స్ట్రక్షన్, ఆటోమొబైల్స్ ప్రధాన కారణం’ అని నౌకరీ.కామ్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ వి.సురేశ్ తెలిపారు. జాబ్ మార్కెట్లో మరికొన్ని నెలలపాటు ఒడిదుడుకులు ఉంటాయని, ఐటీ రంగం ఇంకా ఒత్తిడిలోనే ఉందని పేర్కొన్నారు. నౌకరీ.కామ్ ప్రకారం.. ఆన్లైన్ నియామకాలు వార్షిక ప్రాతిపదికన ముంబైలో 12 శాతం, చెన్నైలో 5 శాతం, ఢిల్లీ–ఎన్సీఆర్లో 1 శాతం పెరిగాయి. -
ఆన్లైన్ నియామకాలు పెరిగాయ్..
న్యూఢిల్లీ: ఆన్లైన్ నియామకాలు పెరిగాయి. వార్షిక ప్రాతిపదికన నవంబర్‌లో 16 శాతం వృద్ధి నమోదయింది. నియామకాల పెరుగుదలకు నాన్–ఐటీ రంగం బాగా దోహదపడింది. రానున్న నెలల్లో కూడా నియామకాలపై అంచనాలు సానుకూలంగానే ఉన్నట్లు జాబ్ పోర్టల్ ‘నౌకరీ.కామ్’ తెలియజేసింది. జాబ్ మార్కెట్ రికవరీని సూచిస్తూ నవంబర్‌లో నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ 2,113 పాయింట్లకు చేరింది. ‘జాబ్ స్పీక్ ఇండెక్స్‌లో 16 శాతం వృద్ధి నమోదయింది. దీనికి నాన్–ఐటీ రంగం ప్రధాన కారణం. నిర్మాణం, ఇంజనీరింగ్, ఆటో, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్, బ్యాంకింగ్ రంగాల్లో చెప్పుకోదగ్గ వృద్ధి నమోదయ్యింది’ అని నౌకరీ.కామ్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ వి.సురేశ్ తెలిపారు. పరిశ్రమల వారీగా చూస్తే.. నిర్మాణ/ఇంజనీరింగ్ నియామకాల్లో 46 శాతం వృద్ధి, వాహన రంగ నియామకాల్లో 39 శాతం వృద్ధి కనిపించింది. ఇక హెవీ మిషనరీ, బ్యాంకింగ్ రంగాల్లో నియామకాలు వరుసగా 30 శాతం, 24 శాతం పెరిగాయి. ఎనిమిది మెట్రో నగరాలకు గానూ ఏడింటిలో నియామకాలు ఎగిశాయి. కోల్‌కతాలో 51 శాతం, ఢిల్లీ–ఎన్సీఆర్లో 15 శాతం, ముంబైలో 16 శాతం వృద్ధి కనిపించింది. బెంగళూరులో మాత్రం 3 శాతం మేర క్షీణించాయి. -
ఆన్లైన్ నియామకాల్లో జోరు
న్యూఢిల్లీ: ఆన్లైన్ నియామకాల్లో పెరుగుదల చోటు చేసుకుంది. వార్షిక ప్రాతిపదికన సెప్టెంబర్‌లో 3 శాతం వృద్ధి నమోదయ్యింది. నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ ఈ నెలలో 3 శాతం వృద్ధితో 1,948కు చేరింది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగంలోని నియామకాలు ఏకంగా 21 శాతం పెరగ్గా, భారీ యంత్ర పరికరాలు, ఇంజనీరింగ్, ఆటో విభాగాల్లోని నియామకాల్లోనూ వరుసగా 19 శాతం, 15 శాతం, 7 శాతం చొప్పున వృద్ధి నమోదైంది. అయితే ఆయిల్ అండ్ గ్యాస్, బీపీవో/ఐటీఈఎస్, ఇన్సూరెన్స్, ఐటీ–సాఫ్ట్వేర్ రంగాల్లో మాత్రం తగ్గుముఖం పట్టాయి. ఈ రంగాల్లో వరుసగా 4 శాతం, 6 శాతం, 9 శాతం, 6 శాతం చొప్పున క్షీణత నమోదైంది. ఇక దేశవ్యాప్తంగా 13 ప్రధాన నగరాలకు గాను 12 నగరాల్లో నియామకాలు పెరిగాయి. ముంబై, కోల్‌కతాలోని నియామకాల్లో 15 శాతం చొప్పున వృద్ధి కనిపించింది. ఢిల్లీ/ఎన్సీఆర్లోని నియామకాలు మాత్రం 9 శాతం క్షీణించాయి. -
నియామకాల వృద్ధిలో హైదరాబాద్ టాప్
న్యూఢిల్లీ: ఆన్లైన్ నియామకాల వృద్ధిలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. నవంబర్ నెలలో ఇక్కడ నియామకాల వృద్ధి 24 శాతంగా నమోదయ్యింది. దీని తర్వాతి స్థానాల్లో ఢిల్లీ-ఎన్సీఆర్, కోల్‌కతా, ముంబై, బెంగళూరు, చెన్నై ఉన్నాయి. ఇక గతేడాది నవంబర్ నెలతో పోలిస్తే ఈ ఏడాది అదే నెలలో నియామకాల వృద్ధి 9 శాతంగా నమోదయ్యింది. ఐటీ, బ్యాంకింగ్ రంగాలతో సహా ఇతర రంగాల్లో కూడా నియామకాల జోరు కొనసాగిందని నౌకరీడాట్‌కామ్ పేర్కొంది. ఇక అక్టోబర్‌తో పోలిస్తే నవంబర్‌లో నియామకాలు 25 శాతం పెరిగాయని నౌకరీడాట్‌కామ్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ వి.సురేశ్ తెలిపారు. రంగాల వారీగా చూస్తే.. టెలికం రంగంలో నియామకాల వృద్ధి అత్యధికంగా 61 శాతంగా నమోదయ్యింది.