న్యూఢిల్లీ: ఆన్‌లైన్ నియామకాలు పెరిగాయి. ఫిబ్రవరి నెలలో 6 శాతం వృద్ధి నమోదయ్యింది. నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ ఫిబ్రవరిలో 2,087 వద్ద నిలిచింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఇండెక్స్‌లో 6 శాతం వృద్ధి కనిపించింది. ‘జాబ్ స్పీక్ ఇండెక్స్‌లో వార్షిక ప్రాతిపదికన 6 శాతం వృద్ధి నమోదయ్యింది.
దీనికి నాన్–ఐటీ రంగాలైన అయిల్ అండ్ గ్యాస్, బీఎఫ్‌ఎస్‌ఐ, ఇన్సూరెన్స్, ఇండస్ట్రీయల్ ప్రొడక్టŠస్, కన్‌స్ట్రక్షన్, ఆటోమొబైల్స్ ప్రధాన కారణం’ అని నౌకరీ.కామ్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ వి.సురేశ్ తెలిపారు. జాబ్ మార్కెట్‌లో మరికొన్ని నెలలపాటు ఒడిదుడుకులు ఉంటాయని, ఐటీ రంగం ఇంకా ఒత్తిడిలోనే ఉందని పేర్కొన్నారు. నౌకరీ.కామ్ ప్రకారం.. ఆన్‌లైన్ నియామకాలు వార్షిక ప్రాతిపదికన ముంబైలో 12 శాతం, చెన్నైలో 5 శాతం, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో 1 శాతం పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment