ముంబై : మరోసారి జీఎస్టీ మెగా సేల్ ప్రారంభం కాబోతుంది. ఈ డిసెంబర్‌లో ఇయర్-ఎండ్ సేల్‌ను నిర్వహించాలని రిటైల్ స్టోర్లు, చైన్లు సన్నద్దమవుతున్నాయి. జీఎస్టీ పాలన కింద ఉన్న నిబంధనల నుంచి విముక్తి లభించకపోతే, దుస్తులు, గాడ్జెట్లు, కిచెన్ వస్తువులు, బొమ్మలు వంటి వస్తువులపై 50 శాతం వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేయాలని రిటైలర్లు చూస్తున్నారు. జీఎస్టీ కంటే ముందు సంబంధిత ఇన్‌వాయిస్‌లు లేకుండా ఉత్పత్తులను కొనుగోలు చేసిన రిటైలర్లకు, ఆరు నెలల తర్వాత ట్రాన్షిషనల్ క్రెడిట్ లభించదు. ఈ నేపథ్యంలో జీఎస్టీ ముందు కొనుగోలు చేసిన వస్తువులను త్వరగా విక్రయించాలని చూస్తున్నారు. ఈ డిసెంబర్‌న మెగా స్టాక్ క్లియరెన్స్ సేల్‌ను కొనుగోలుదారులు పొందవచ్చని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఇప్పటి వరకైతే కొంత మంది పెద్ద పెద్ద రిటైలర్లు తమ స్టాక్‌ను నవంబర్ ముగింపు వరకు ఉంచుకోవాలని చూస్తున్నాయని, ఆ లోపు సమస్య పరిష్కారం కాకపోతే డిస్కౌంట్లకు తెరతీయాలని ప్లాన్ వేస్తున్నాయని సంబంధిత వర్గాలు చెప్పాయి.
ఈ విషయంపై త్వరలోనే ప్రభుత్వం కూడా ఓ నిర్ణయం త్వరలోనే తీసుకుంటుందని పన్ను నిపుణులు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రీ-జీఎస్టీ స్టాక్‌ను వదిలించుకోవడానికి దివాలి సమయంలోనే రిటైలర్లు ఆఫర్లు ప్రకటించాయి. ఇక డెడ్‌లైన్ మరింత పొడిగించే అవకాశం సన్నగిల్లుతున్న నేపథ్యంలో డిసెంబర్ ముగింపు కంటే ముందస్తుగానే ఎలాగైనా స్టాక్‌ను విక్రయించనున్నట్టు ఓ పెద్ద రిటైల్ చైన్ సీఈవో చెప్పారు. షర్ట్‌లు, కిచెన్ అప్లియెన్స్, చిన్న వ్యాపారస్తుల నుంచి కొనుగోలు చేసిన హ్యాండిక్రాఫ్ట్‌లు వంటి వాటిపై భారీ మొత్తంలో డిస్కౌంట్లు ఆఫర్ చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటికే సింగిల్ బ్రాండు రిటైలర్లు, చైన్ స్టోర్లు డిసెంబర్‌లో డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నట్టు ధృవీకరించారు. చిన్న చిన్న దుకాణదారులు కూడా వచ్చే నెలలో డిస్కౌంట్లు ఆపర్ చేయనున్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment