ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ కు పోటీగా...? | HDFC Life, Max Life in talks to create India's biggest private life insurer | Sakshi
Sakshi News home page

ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ కు పోటీగా...?

Published Fri, Jun 17 2016 10:59 AM | Last Updated on Mon, Sep 4 2017 2:44 AM

ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ కు పోటీగా...?

ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ కు పోటీగా...?

ముంబై : హెచ్డీఎఫ్సీ లైఫ్, మ్యాక్స్ లైఫ్ లు రెండూ జతకట్టి దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ లైఫ్ ఇన్సూరర్ గా ఉద్భవించబోతున్నాయి. హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ తో విలీనం అయ్యేందుకు మార్గాలను అన్వేషిస్తుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ రెండు కంపెనీల ప్రతినిధులు విలీన చర్చలు జరపడానికి ముంబైలో సమావేశం కాబోతున్నారని వెల్లడించారు. హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ ఈ సమావేశానికి అధ్యక్షత కాబోతున్నారని పేర్కొన్నారు.

ఈ విలీన వార్త మార్కెట్లకి అందగానే శుక్రవారం ఉదయం ట్రేడింగ్ లో మ్యాక్స్ ఫైనాన్సియల్ సర్వీస్ లిమిటెడ్ షేర్లు, హెచ్డీఎఫ్సీ షేర్లు లాభాల పంట పండిస్తున్నాయి. మ్యాక్స్ ఫైనాన్సియల్  షేర్లు 20శాతం, హెచ్ డీఎఫ్ సీ షేర్లు 1.5శాతం పుంజుకున్నాయి. ఈ రెండు కంపెనీలు విలీనమై అతిపెద్ద ప్రైవేట్ సంస్థగా ఉన్న ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ కంటే దూసుకుపోయేందుకు సన్నద్ధ మవుతున్నాయని తెలుస్తోంది. అదేవిధంగా దేశంలో ఉన్న ఇన్సూరెన్స్ సంస్థలకు ఈ విలీనం గట్టి పోటీని ఇవ్వనుందని సమాచారం. మార్కెట్ షేర్ ను, లాభాలను పెంచుకోవడానికి కంపెనీలు కొత్త మార్గాలను చేపడుతున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ ప్రణాళిక గురించి కంపెనీలు అధికారికంగా ఇంకో కొన్ని రోజుల్లో వెల్లడించనున్నాయి. ఒకవేళ ఈ చర్చలు సఫలమైతే, దాదాపు దశాబ్దం తర్వాత లైఫ్ ఇన్సూరర్స్ లో జరగబోయే మొదటి విలీనం ఇదే కానుంది. ఈ రెండు కంపెనీలు విలీనమై ఒకటిగా సేవలు అందించేందుకు  షేర్ హోల్డర్స్ సైతం అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే ఈ డీల్ ఎలా ఉండబోతుందనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

హెచ్డీఎఫ్ లిమిటెడ్ కు, స్టాండర్డ్ లైఫ్ కు హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ జాయింట్ వెంచర్. ఈ కంపెనీ 61శాతం యాజమాన్య వాటా  హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, 35శాతం యాజమాన్య వాటా స్టాండర్డ్ లైఫ్ కలిగి ఉన్నాయి. అదేవిధంగా మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మెజార్టి యాజమాన్య వాటా అంటే 68శాతం మ్యాక్స్ ఫైనాన్సియల్ ఆధీనంలోనే ఉంది. అయితే ఈ విలీనంపై స్పందించడానికి హెచ్డీఎఫ్సీ, మ్యాక్స్  లు తిరస్కరించాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement