ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా స్టార్టప్‌ల పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. ఆయన తాజాగా బెంగళూరుకు చెందిన రిటైల్ టెక్నాలజీ స్టార్టప్ స్నాప్‌బిజ్‌లో పెట్టుబడులు పెట్టారు. ఎంత మొత్తం పెట్టుబడులు పెట్టిన వివరాలు వెల్లడి కాలేదు. ఈ ఏడాది స్టార్టప్‌లో ఆయనకు ఇది 8వ పెట్టుబడి. మొత్తం మీద ఆయన ఇప్పటిదాకా 20 స్టార్టప్‌ల్లో ఇన్వెస్ట్ చేశారు. రతన్ టాటా తమ సంస్థలో ఇన్వెస్ట్ చేయడం అతి పెద్ద ప్రోత్సాహమని స్నాప్‌బిజ్ సంస్థ పేర్కొంది. భారత కిరాణ దుకాణాల్లో డిజిటల్ విప్లవాన్ని మరింత వేగవంతం చేస్తామని కంపెనీ సీఈఓ ప్రేమ్ కుమార్ తెలిపారు.