హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శానిటరీవేర్ కంపెనీ హెచ్‌ఎస్‌ఐఎల్... తెలంగాణలో పైపుల తయారీ ప్లాంటును ప్రారంభించింది. తద్వారా సీపీవీసీ, యూపీవీసీ పైపుల విభాగంలోకి కంపెనీ ప్రవేశించిం ది. ట్రూఫ్లో బ్రాండ్ పేరుతో వీటిని విక్రయిస్తారు. హైదరాబాద్ సమీపంలోని ఇస్నాపూర్ వద్ద రూ.160 కోట్ల వ్యయంతో 30,000 టన్నుల సామర్థ్యంతో ఈ యూనిట్‌ను స్థాపించింది.
2020 నాటికి ప్లాంటు సామర్థ్యాన్ని రెండింతలకు చేరుస్తామని హెచ్‌ఎస్‌ఐఎల్ వైస్ చైర్మన్, ఎండీ సందీప్ సొమానీ ఈ సందర్భంగా సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. విస్తరణకు రూ.100 కోట్లు వెచ్చిస్తామన్నారు. సీపీవీసీ పైపుల విపణి దేశంలో 28 శాతం వార్షిక వృద్ధితో రూ.3,200 కోట్లుంది. రూ.100 కోట్లతో చేపట్టిన మెదక్‌లోని సెక్యూరిటీ బాటిల్ క్యాప్స్ ప్లాంటు విస్తరణ ఈ ఏడాది సెప్టెంబరుకల్లా పూర్తి అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment