ఐసీఐసీఐ అకాడమీ నుంచిలక్ష మందికి శిక్షణ: కొచర్ | ICICI group to train 1 lakh youth by 2017: Kochhar | Sakshi
Sakshi News home page

ఐసీఐసీఐ అకాడమీ నుంచిలక్ష మందికి శిక్షణ: కొచర్

Published Sat, Jul 16 2016 12:53 AM | Last Updated on Wed, Sep 19 2018 8:39 PM

ఐసీఐసీఐ అకాడమీ నుంచిలక్ష మందికి శిక్షణ: కొచర్ - Sakshi

ఐసీఐసీఐ అకాడమీ నుంచిలక్ష మందికి శిక్షణ: కొచర్

న్యూఢిల్లీ: ఐసీఐసీఐ అకాడమీ తరఫున 2017 మార్చి నాటికి లక్ష మంది యువతకు శిక్షణ ఇవ్వనున్నట్టు ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో చందా కొచర్ తెలిపారు. నైపుణ్య అభివృద్ధి, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కార్యక్రమంలో భాగంగా దీన్ని చేపట్టనున్నట్టు ఆమె చెప్పారు. మానవ వనరుల లభ్యత, ఉపాధి అవకాశాల మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చాల్సి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. వరల్డ్ యూత్ స్కిల్స్ డే సందర్భంగా ఆమె ఈ అంశంపై మాట్లాడారు. యువత నైపుణ్యాలను పెంచుకుంటే... ఉపాధి అవకాశాలను సొంతం చేసుకోవచ్చన్నారు.

‘ప్రపంచంలో యువశక్తి ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. 62 శాతం జనాభా పనిచేసే వారు ఉంటే, అందులో 54 శాతం 25 ఏళ్లలోపు వారే. ఈ సానుకూలతను ప్రయోజనకరంగా మలచుకోవాలంటే... ఉద్యోగం లేదా ఉపాధి అవకాశాలను సొంతం చేసుకునేందుకు వీలుగా యువతీ యువకుల్లో నైపుణ్య వృద్ధికి తోడ్పడాలి. దీంతో దేశాన్ని మరింత అభివృద్ధి వైపు నడిపించే శక్తి వారే అవుతారు’ అని చందాకొచ్చర్ వివరించారు. ఐసీఐసీఐ అకాడమీ నిరుద్యోగులకు వివిధ రకాల కోర్సుల్లో శిక్షణనిస్తోంది. శిక్షణ అనంతరం ఉద్యోగాల కల్పనకు 800 కంపెనీలతో ఒప్పందం కూడా చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement