ప్రపంచ ఖరీదైన నగరాల జాబితాలో హైదరాబాద్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఖరీదైన నగరాల జాబితాలో హైదరాబాద్ 227 స్థానంలోనూ, ప్రాంతీయంగా (ఆసియా-పసిఫిక్ ప్రాంతం) 56వ స్థానంలోనూ నిలిచింది. భారత్‌లో న్యూఢిల్లీ ఖరీదైన నగరంగా ఉంది. న్యూఢిల్లీ గ్లోబల్ జాబితాలో 174వ స్థానాన్ని, ప్రాంతీయంగా 41వ స్థానాన్ని పొందింది. ఈసీఏ ఇంటర్నేషనల్ నిర్వహించిన ‘కాస్ట్ ఆఫ్ లివింగ్’ సర్వే ప్రకారం.. వస్తు ధరల పెరుగుదల నెమ్మదిగా ఉన్నప్పటికీ జాబితాలో చోటుదక్కించుకున్న భారతీయ పట్టణాల స్థానం మాత్రం మెరుగుపడటం విశేషం. అంతర్జాతీయ జాబితాలో ముంబై, పుణే, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా స్థానాలు వరుసగా 197గా, 209గా, 214గా, 220గా, 226గా ఉన్నా యి. ఇవే పట్టణాలు ప్రాంతీయంగా వరుసగా 48, 51, 52, 54, 55 స్థానాలను దక్కించుకున్నాయి. అంతర్జాతీయంగా అతి ఖరీదైన నగరంగా దక్షిణ సూడాన్ పట్టణం ఉంది.