Expensive cities list
-
ఇండియాలో అక్కడ నివాసం చాలా కాస్ట్లీ - హైదరాబాద్ స్థానం ఏంటంటే?
న్యూఢిల్లీ: ప్రవాసులకు భారత్‌లో నివాస వ్యయాల పరంగా ముంబై ఖరీదైన పట్టణంగా ఉన్నట్టు మెర్సర్ 2023 జీవన వ్యయ సర్వే నివేదిక వెల్లడించింది. ముంబై తర్వాత ఖరీదైన పట్టణాలుగా న్యూఢిల్లీ, బెంగళూరు నిలిచాయి. అంతర్జాతీయంగా చూస్తే ముంబై ర్యాంక్ (నివాస వ్యయాల పరంగా) 147గా ఉంది. న్యూఢిల్లీ 169, చెన్నై 184, బెంగళూరు 189, హైదరాబాద్ 202, కోల్‌కతా 211, పుణె 213 ర్యాంకులతో ఉన్నాయి. ముంబైతో పోలిస్తే హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా పుణెలో ప్రవాసులకు వసతి వ్యయాలు సగమే ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొంది. దేశంలో కోల్‌కతా అతి తక్కువ వ్యయాలతో ఉన్నట్టు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 227 పట్టణాలను సర్వే చేసి మెర్సర్స్ ఈ నివేదికలో ర్యాంకులు కేటాయించింది. అంతర్జాతీయంగా హాంగ్‌కాంగ్, సింగపూర్, జ్యూరిచ్ ప్రవాస ఉద్యోగులకు అత్యంత ఖరీదైన పట్టణాలుగా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. అతి తక్కువ వ్యయాలతో కూడిన పట్టణాలుగా హవానా, కరాచీ, ఇస్లామాబాద్ ఉన్నాయి. నివాసం, రవాణా, ఆహారం, వస్త్రాలు, ఇంటి వస్తువులు, వినోదానికి అయ్యే ఖర్చు ఇలా 200 వస్తువులకు అయ్యే వ్యయాల ఆధారంగా మెర్సర్ ఈ అంచనాలను రూపొందించింది. ఇతర ప్రాంతాల్లో కరెన్సీ విలువల్లో అస్థిరతలు, వస్తు సేవల ధరలపై ద్రవ్యోల్బణ ప్రభావం వంటివి భారత పట్టణాల ర్యాంకులు దిగువకు మారేలా కారణమైనట్టు మెర్సర్ ఇండియా మొబిలిటీ లీడర్ రాహుల్ శర్మ తెలిపారు. (ఇదీ చదవండి: అమెరికా వద్దు భారత్ ముద్దు.. 60 ఏళ్ల వయసులో 100 వ్యాపారాలు) ఢిల్లీ, ముంబై అనుకూలం బహుళజాతి సంస్థలు విదేశాల్లో కార్యకలాపాలు ఏర్పాటు చేసుకోవాలంటే ఢిల్లీ, ముంబై వ్యయాల పరంగా అనుకూలమైన వేదికలుగా ఉన్నట్టు మెర్సర్ నివేదిక తెలిపింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇక్కడ నివాస వ్యయాలు తక్కువగా ఉన్నట్టు పేర్కొంది. -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలు ఇవే! భారత్ నుంచి మాత్రం..
లండన్: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలుగా న్యూయార్క్, సింగపూర్ అగ్రభాగంలో నిలిచాయి. పెరుగుతున్న జీవన వ్యయం ఆధారంగా చేసుకొని లండన్‌కు చెందిన ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) 172 నగరాల జాబితాను రూపొందించింది.ఈ నగరాల్లో గత ఏడాదితో పోల్చి చూస్తే కాస్ట్ ఆఫ్ లివింగ్ సగటున 8.1% పెరిగినట్టు తాను విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నగరం గత ఏడాది మొదటి స్థానంలో ఉంటే ఈ సారి మూడో స్థానానికి తగ్గింది. ఆసియా దేశాల్లో ఏడాదిలో జీవన వ్యయం సగటున 4.5% పెరిగిందని ఆ నివేదిక తెలిపింది. న్యూయార్క్, సింగపూర్ మొదటి స్థానాన్ని పంచుకుంటే నాలుగో స్థానంలో హాంకాంగ్, లాస్ఏంజెలెస్ నిలిచాయి. సర్వే ఎలా చేశారంటే.! ప్రపంచవ్యాప్తంగా 172 నగరాల్లోని 200కిపైగా నిత్యావసర వస్తువుల ధరలు, 400 వరకు రవాణా, వైద్య చికిత్స వంటి సేవల ధరల్ని పోల్చి చూస్తూ ఈ జాబితాను రూపొందించారు. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్‌లో ఈ సర్వే నిర్వహించినట్టుగా ఈఐయూ సంస్థ చీఫ్ ఉపాసన దత్ వెల్లడించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలు, చైనాలో జీరో కోవిడ్ విధానం వల్ల ప్రపంచ వ్యాప్తంగా వస్తు సామాగ్రి రవాణాలో ఆటంకాలు ఏర్పడి ధరలు పెరిగిపోయాయని , గత 20 ఏళ్లలో ఈ స్థాయిలో ధరలు పెరగడం ఎప్పుడూ చూడలేదని ఆమె తెలిపారు. అమెరికాలో ధరాభారం విపరీతంగా పెరిగిపోవడంతో ఆ దేశంలోని మూడు నగరాల్లో మొదటి పది స్థానాల్లో నిలిచాయని ఉపాసన వివరించారు. మన నగరాలు చౌక ఇక భారత్‌లోని నగరాల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువని ఈ సర్వేలో తేలింది. మొత్తం 172 దేశాలకు గాను మన దేశంలో బెంగుళూరు 161 స్థానంలోనూ చెన్నై 164, అహ్మదాబాద్ 165 స్థానంలోనూ నిలిచాయి. అత్యంత చౌక నగరాలుగా సిరియా రాజధాని డమాస్కస్, లిబియాలోని ట్రిపోలీ అట్టడుగున వరసగా 172, 171 స్థానాల్లో నిలిచాయి. టాప్–10 ఖరీదైన నగరాలు ఇవే 1. న్యూయార్క్ (అమెరికా) 1. సింగపూర్ 3. టెల్ అవీవ్ (ఇజ్రాయెల్) 4. హాంకాంగ్ 4. లాస్ ఏంజెలెస్ (అమెరికా) 6. జ్యూరిచ్ (స్విట్జర్లాండ్) 7. జెనీవా ( స్విట్జర్లాండ్) 8. శాన్ఫ్రాన్సిస్కో (అమెరికా) 9. పారిస్ (ఫ్రాన్స్) 10. కోపెన్హగెన్ (డెన్మార్క్) 10. సిడ్నీ (ఆస్ట్రేలియా) -
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన నగరాలతోపాటు అత్యంత చౌక నగరాలు ఉంటాయని తెల్సిందే. ఖరీదైన నగరాల్లో మానవ జీవన వ్యయం ఎక్కువగా ఉంటే, చౌక నగరాల్లో మానవ జీవన వ్యయం తక్కువగా ఉంటుంది. అంటే ఓ మనిషి జీవించడానికయ్యే ఖర్చును జీవన వ్యయంగా పరిగణిస్తారు. అలా మానవ జీవితానికి అవసరమైన 138 వస్తువుల జాబితాలను రూపొందించి ప్రపంచంలోని 130 నగరాల్లో వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలసుకోవడం ద్వారా ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ‘ప్రపంచ దేశాల్లో జీవన వ్యయం 2020’ పేరిట ఓ సర్వే నివేదికను రూపొందించి విడుదల చేసింది. (చదవండి : ఏకైక శ్వేత జిరాఫీకి జీపీఎస్ ట్రాకర్) ఆ సర్వే ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలు హాంకాంగ్, పారిస్, జూరిచ్ కాగా, అంతకంటే కొంచెం తక్కువ ఖరీదైన నగరాలు సింగపూర్, ఒసాకా, టెల్ అవీవ్, న్యూయార్క్. ప్రపంచంలోనే అత్యంత చౌకైన దేశం సిరియా రాజధాని డమస్కస్. ఆ తర్వాత ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కంట్, లుసాకా, కారకాస్, ఆల్మటీ నగరాలు. ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రంగంపై ప్రభావం చూపిన నేపథ్యంలో ఈఐయు ఈ సర్వేను నిర్వహించింది. అమెరికా డాలర్‌పై యూరో స్విస్ ఫ్రాంక్‌ల విలువ పెరగడంతో అత్యంత ఖరీదైన నగరాల్లో ఐదవ స్థానంలో ఉన్న పారిస్, జూరిచ్ అగ్రభాగానికి చేరుకున్నాయి. కరోనా ప్రభావం వల్ల రెండు ఆసియా దేశాల్లో నిత్యావసర సరకుల ధరలు పడిపోయాయి. అలా నాలుగో స్థానంలో ఉన్న సింగపూర్, ఒసాకా ఐదవ స్థానానికి పడి పోయాయి. విదేశీ కార్మికులు సొంత దేశాలకు తిరిగి పోవడంతో సింగపూర్‌లో కాస్త ధరలు పడి పోయాయి. -
ప్రపంచ ఖరీదైన నగరాల జాబితాలో హైదరాబాద్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఖరీదైన నగరాల జాబితాలో హైదరాబాద్ 227 స్థానంలోనూ, ప్రాంతీయంగా (ఆసియా-పసిఫిక్ ప్రాంతం) 56వ స్థానంలోనూ నిలిచింది. భారత్‌లో న్యూఢిల్లీ ఖరీదైన నగరంగా ఉంది. న్యూఢిల్లీ గ్లోబల్ జాబితాలో 174వ స్థానాన్ని, ప్రాంతీయంగా 41వ స్థానాన్ని పొందింది. ఈసీఏ ఇంటర్నేషనల్ నిర్వహించిన ‘కాస్ట్ ఆఫ్ లివింగ్’ సర్వే ప్రకారం.. వస్తు ధరల పెరుగుదల నెమ్మదిగా ఉన్నప్పటికీ జాబితాలో చోటుదక్కించుకున్న భారతీయ పట్టణాల స్థానం మాత్రం మెరుగుపడటం విశేషం. అంతర్జాతీయ జాబితాలో ముంబై, పుణే, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా స్థానాలు వరుసగా 197గా, 209గా, 214గా, 220గా, 226గా ఉన్నా యి. ఇవే పట్టణాలు ప్రాంతీయంగా వరుసగా 48, 51, 52, 54, 55 స్థానాలను దక్కించుకున్నాయి. అంతర్జాతీయంగా అతి ఖరీదైన నగరంగా దక్షిణ సూడాన్ పట్టణం ఉంది.