పెరిగిన దేశీ తయారీ స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు
బెంగళూరు: ప్రతిష్టాత్మక ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమం సత్ఫలితాలను అందిస్తోంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 19.9 శాతంగా ఉన్న స్థానికంగా తయారైన స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు రెండో త్రైమాసికంలో 24.8 శాతానికి పెరిగాయి. అంటే మొత్తం స్మార్ట్‌ఫోన్ల ఎగుమతుల్లో 24.8 శాతం ఇండియాలో తయారైనవి లేదా అసెంబుల్ అయినవి వున్నాయి. సైబర్‌మీడియా రీసెర్చ్ నివేదిక ప్రకారం మొత్తం భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. శాంసంగ్, స్పైస్ కంపెనీలకు ఇప్పటికే దేశంలో ప్లాంట్లు ఉన్నాయి. హెచ్‌టీసీ, జియోనీ వంటి కంపెనీలు ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నాయి.