విదేశాల్లో భారత కంపెనీల పెట్టుబడులు తగ్గుముఖం | India Inc's foreign investments decline 36% to $1.39 bn in July | Sakshi
Sakshi News home page

విదేశాల్లో భారత కంపెనీల పెట్టుబడులు తగ్గుముఖం

Published Wed, Sep 5 2018 12:47 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM

India Inc's foreign investments decline 36% to $1.39 bn in July - Sakshi

ముంబై: దేశీయ కంపెనీల విదేశీ పెట్టుబడులు ఈ ఏడాది జూలై నెలలో 36 శాతం తగ్గుముఖం పట్టాయి. ఆర్‌బీఐ గణాంకాలను పరిశీలిస్తే... భారత కంపెనీల విదేశీ పెట్టుబడులు ఈ ఏడాది జూలైలో 1.39 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే నెలలో మన కంపెనీల విదేశీ పెట్టుబడులు 2.17 బిలియన్‌ డాలర్లు.

విదేశీ సబ్సిడరీలు, జాయింట్‌ వెంచర్లపై కంపెనీలు పెట్టుబడులు పెడుతుంటాయి. రుణాల రూపంలో, ఈక్విటీ, గ్యారంటీల రూపంలో ఈ మేరకు సర్దుబాటు చేస్తుంటాయి. సెరమ్‌ ఇనిస్టిట్యూట్‌ నెథర్లాండ్స్‌లోని తన సబ్సిడరీ కోసం 187.9 మిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెట్టింది. స్టెరిలైట్‌ టెక్నాలజీస్, ఇంటర్‌గ్లోబ్‌ ఎంటర్‌ప్రైజెస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ సైతం ఈ జాబితాలో ఉన్నాయి. ఈ ఏడాది జూన్‌ నెలలో పెట్టుబడులు 2.07 బిలియన్‌ డాలర్లుగా ఉండడం గమనార్హం.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement