బ్రిటన్‌లో 4వ అతి పెద్ద ఇన్వెస్టర్... భారత్
మూడో స్థానం నుంచి మరో స్థానం కిందికి
లండన్: బ్రిటన్‌లో భారీగా ఇన్వెస్ట్ చేసిన దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానానికి తగ్గింది. ఇప్పటిదాకా మూడో అతి పెద్ద ఇన్వెస్టరుగా ఉండేది. తాజాగా విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం బ్రిటన్‌లో 577 ప్రాజెక్టుల్లో పెట్టుబడులతో అమెరికా టాప్ స్థానంలో ఉండగా, 160 ప్రాజెక్టులతో చైనా (హాంకాంగ్ సహా) రెండో స్థానంలో నిల్చింది.
131 ప్రాజెక్టులతో ఫ్రాన్స్ మూడో స్థానానికి ఎగబాకింది. 127 ప్రాజెక్టులతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో కలిసి భారత్ నాలుగో స్థానంలో ఉంది. అంతర్జాతీయ వాణిజ్య విభాగం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2016–17లో 127 కొత్త ప్రాజెక్టులతో భారత్.. బ్రిటన్‌లో 7,645 ఉద్యోగాలను కాపాడటంతో పాటు అదనంగా 3,999 కొత్త ఉద్యోగాలు కల్పించింది.