ప్రపంచ వృద్ధికి కేంద్రంగా భారత్
హార్వర్డ్ పరిశోధకుల అధ్యయనం
న్యూయార్క్: రాబోయే దశాబ్ద కాలంలో చైనాను తోసిరాజని ప్రపంచ వృద్ధికి భారత్ ఆర్థిక ధృవంగా నిలుస్తుందని హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఒక నివేదికలో వెల్లడించింది. 2025 నాటికి వార్షికంగా 7.7 శాతం వృద్ధితో భారత్, ఉగాండా మాత్రమే అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశాలుగా నిలుస్తాయని పేర్కొంది. గడిచిన కొన్నాళ్లుగా ప్రపంచ వృద్ధికి ఊతమిచ్చే ఆర్థిక ధృవం చైనా నుంచి భారత్‌కు మారిందని పేర్కొంది.