World growth
-
అప్పటి వరకూ.. పసిడి పరుగే!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పటిష్ట వృద్ధి బాట పట్టే వరకూ పెట్టుబడిదారులకు బంగారం ఒక సురక్షిత సాధనంగా కొనసాగే అవకాశం ఉంటుందని ప్రముఖ మార్కెట్ డేటా విశ్లేషణా సంస్థ రిఫినిటివ్ అంచనావేస్తోంది. ఆయా అంశాల నేపథ్యంలో పసిడికి డిమాండ్ కొనసాగే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ ఏడాది ఆభరణాలకు డిమాండ్ 40 శాతం పడిపోవచ్చని విశ్లేషించిన సంస్థ సీనియర్ విశ్లేషకులు, అదే సమయంలో పెట్టుబడులకు సంబంధించి డిమాండ్ 15 శాతం పెరుగుతుందని అంచనావేస్తున్నారు. ఒక వెబినార్‌లో మంగళవారం వారు ఈ అంశాలను వివరించారు. కీలక అంశాలను పరిశీలిస్తే... పసిడి కదలికలు ఇలా... కరోనా తీవ్రత నేపథ్యంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్‌లో– నైమెక్స్‌లో పసిడి ఔ¯Œ్స (31.1గ్రాములు) ధర జూలై 27వ తేదీన తొమ్మిదేళ్ల గరిష్ట స్థాయి 1,911.60 డాలర్లను బ్రేక్ చేసింది. అటు తర్వాత వారంరోజుల్లోనే చరిత్రాత్మక స్థాయి 2,089 డాలర్ల గరిష్ట స్థాయిని తాకింది. ఈ ధరల వద్ద లాభాల స్వీకరణతో క్రమంగా రెండు వందల డాలర్ల వరకూ తగ్గింది. ఈ వార్త రాసే రాత్రి 12 గంటలకు కీలక మద్దతు స్థాయి 1,900 డాలర్లకు ఎగువన 1,902 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. సోమవారం ముగింపుతో పోల్చితే ఇది 20 డాలర్లు అధికం. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– ఎంసీఎక్స్‌లో అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా పసిడి 10 గ్రాముల ధర మంగళవారం ఈ వార్త రాసే సమయానికి రూ.550 లాభంతో రూ. 50,680 వద్ద ట్రేవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ధర ఆల్‌టైమ్ గరిష్టానికి చేరినప్పడు ఈ ధర ఇక్కడ రూ.54,000 వరకూ వెళ్లింది. ఉద్దీపన చర్యల తోడ్పాటు కోవిడ్–19ను ఎదుర్కొనే క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు ఇంతకుముందెన్నడూ లేని స్థాయిలో ఆర్థిక ఉద్దీపన చర్యలను చేపట్టాయి. దీనితోపాటు వృద్ధికి తోడ్పాటును అందించే క్రమంలో వడ్డీరేట్లు అతి తక్కువ స్థాయిలో కొనసాగించడానికీ మొగ్గుచూపుతున్నాయి. పసిడి డిమాండ్ పెరుగుదలకు ఆయా అంశాలు దోహదం చేస్తాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి పసిడికి డిమాండ్‌ను గరిష్ట స్థాయిలకు తీసుకువెళుతుంది. ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఉద్దీపన చర్యలకు సంబంధించిన నిధులను పసిడిని ఆకర్షికంచే అవకాశం ఉంది. – దేబజిత్ సాహా, రిఫినిటివ్ సీనియర్ మెటల్స్ విశ్లేషకులు ఫిజికల్ డిమాండ్ ఉండదు బంగారం సరఫరా ఈ ఏడాది 3 శాతం పెరిగింది. దీనికి స్క్రాప్ సరఫరాల్లో పెరుగుదలా ఒక కారణం. దీనితో గనుల నుంచి సరఫరాలు కొంత తగ్గాయి. కోవిడ్–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పసిడికి ఫిజికల్ డిమాండ్ ఉండకపోవచ్చు. ఇటీవల తగ్గిన ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) డిమాండ్, మళ్లీ ఊపందుకునే అవకాశం ఉంది. 2020 చివరికి ఈ డిమాండ్ వెయ్యి టన్నులు దాటే అవకాశం ఉంది. – క్యామెరాన్ అలెగ్జాండర్, రిఫినిటివ్ ప్రెషియస్ మెటల్స్ రీసెర్చ్ హెడ్ -
సంస్కరణలను కొనసాగించాల్సిందే
వాషింగ్టన్: సంస్కరణల మార్గం తప్పుతున్న దేశాలను అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) బుధవారం హెచ్చరించింది. దీనివల్ల అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో భద్రత తగ్గుతుందని, స్థిరత్వం అపాయంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా దేశాలు పరస్పర సహకారంతో సంస్కరణలను తప్పనిసరిగా కొనసాగించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత పదేళ్ల కాలంలో సంస్కరణల తీరు, భవిష్యత్తుకు సంబంధించి ఓ నివేదికను ఐఎంఎఫ్ విడుదల చేసింది. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం అనంతరం 10 ఏళ్ల కాలంలో ప్రగతి స్పష్టంగా ఉందంటూ, సంస్కరణల ఎంజెడా తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని సూచించింది. సంస్కరణలను ఉపసంహరించుకుంటే, రెగ్యులేటరీ ఆర్బిట్రేజ్ అవకాశాలు తగ్గిపోతాయని పేర్కొంది. ఇది నియంత్రణ, పర్యవేక్షణ మరింత పడిపోయేందుకు దారితీస్తుందని అభిప్రాయపడింది. సైబర్ సెక్యూరిటీ రిస్క్ పెరగడం వల్ల ఆర్థిక సంస్థలకు సవాళ్లు పొంచి ఉన్నాయని... ఈ విషయంలో నియంత్రణ, పర్యవేక్షణ సంస్థలు సదా అప్రమత్తంగా ఉండి, అవసరమైతే చర్యలు తీసుకోవాలని ఐఎంఎఫ్ సూచించింది. -
ప్రపంచ వృద్ధికి కేంద్రంగా భారత్
హార్వర్డ్ పరిశోధకుల అధ్యయనం న్యూయార్క్: రాబోయే దశాబ్ద కాలంలో చైనాను తోసిరాజని ప్రపంచ వృద్ధికి భారత్ ఆర్థిక ధృవంగా నిలుస్తుందని హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఒక నివేదికలో వెల్లడించింది. 2025 నాటికి వార్షికంగా 7.7 శాతం వృద్ధితో భారత్, ఉగాండా మాత్రమే అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశాలుగా నిలుస్తాయని పేర్కొంది. గడిచిన కొన్నాళ్లుగా ప్రపంచ వృద్ధికి ఊతమిచ్చే ఆర్థిక ధృవం చైనా నుంచి భారత్‌కు మారిందని పేర్కొంది. -
ప్రపంచ వృద్ధికి భారత్ మూలస్తంభం
అంటాల్యా: ప్రపంచ వృద్ధి, స్థిరత్వానికి మూలస్తంభంగా మారే శక్తిసామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. భారత్ చేపట్టిన పలు ఆర్థిక సంస్కరణలు దేశాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) 7.5 శాతం వృద్ధి రేటు బాటన నిలబెడతాయని అన్నారు. రానున్న సంవత్సరాల్లో ఈ రేటు మరింత మెరుగుపడుతుందని కూడా ఆయన భరోసా వ్యక్తం చేశారు. ఈ మేరకు జీ-20 దేశాల అగ్రనాయకులను ఉద్దేశించి ఆయన కీలక ప్రసంగం చేశారు. దేశంలో పౌరులందరినీ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం చేసే పెద్ద కార్యక్రమాన్ని భారత్ చేపట్టిందన్నారు. ప్రజలందరికీ కనీస అవసరాలు తీర్చడానికి లక్ష్యాలను నిర్ధేశించుకుని, వీటి సాధనకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలను సృష్టించే క్రమంలో ‘నైపుణ్యతల మెరుగుదలకు’ ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. అలాగే మౌలిక రంగం పురోగతికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 2030 కల్లా ప్రపంచంలో పేదరిక నిర్మూలనా లక్ష్యాన్ని (ప్రపంచ సుస్థిరాభివృద్ధి- ఎస్డీజీ) ఆయన ఉటంకిస్తూ...ఈ అంతర్జాతీయ లక్ష్యానికి అనుగుణంగా భారత్ కూడా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ‘వృద్ధి-పురోగతి- ప్రజా సంక్షేమం- పర్యావరణం’ అంశాల మధ్య భారత్ సమతూకం సృష్టించిందన్నారు. ఎస్డీజీ లక్ష్యాలకు జీ-20 దేశాలు కూడా పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. తద్వారా విస్తృత ప్రాతిపదికన, త్వరతగతిన వృద్ధి సాధించడం సాధ్యమవుతుందని అన్నారు. వర్ధమాన దేశాల అభివృద్ధికే బ్రిక్స్ బ్యాంక్ నిధులు: ప్రధాని మోదీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సమ్మిళిత ఆర్థికాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగానే బ్రిక్స్ బ్యాంక్(న్యూ డెవలప్మెంట్ బ్యాంక్-ఎన్డీబీ) నిధులను అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారమిక్కడ పేర్కొన్నారు. వర్ధమాన దేశాల అవసరాలను తీర్చేదిశగా భారత్ దిశానిర్దేశం చేయనుందని చెప్పారు. జీ20 దేశాల రెండు రోజుల సదస్సులో పాల్గొనే ముందు ప్రధాని మోదీ సహా బ్రిక్స్ దేశాధినేతల సమావేశం జరిగింది. బ్రిక్స్ దేశాల కూటమి(బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) నేతృత్వంలో 50 బిలియన్ డాలర్ల ప్రారంభ మూలధనంతో ఎన్డీబీ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా, బ్యాంక్ కార్యకలాపాల ప్రారంభంలో పురోగతిని తాజా సమావేశంలో అధినేతలు చర్చించారు. మరోపక్క, 100 బిలియన్ డాలర్లతో లిక్విడిటీ రిజర్వ్ ఫండ్ ఏర్పాటుపైనా ఈ సమావేశం దృష్టిసారించింది. చైనాలోని షాంగై ప్రధాన కేంద్రంగా ఏర్పాటవుతున్న ఎన్డీబీకి తొలి అధ్యక్షుడిగా భారతీయుడైన కేవీ కామత్‌ను ఇప్పటికే నియమించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి బ్యాంక్ రుణాల జారీ ప్రారంభం కానుంది. కాగా, వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి భారత్‌కు బ్రిక్స్ చైర్మన్ హోదా లభించనుంది. అనుసంధానంతోనే అభివృద్ధి: మిట్టల్ అనుసంధానంతోనే అభివృద్ధి సాధ్యమౌతుందని భారతీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునిల్ మిట్టల్ అభిప్రాయపడ్డారు. జీ-20 దేశాధినేతాలు అందరికీ ఇంటర్నెట్ను అందుబాటులోకి తీసుకురావడానికి కృషిచేయాలని కోరారు. ప్రపంచ సమ్మిళిత ఆర్థిక వృద్ధిలో ఇంటర్నెట్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఆయన ఇక్కడ జరిగిన జీ-20 సదస్సులో మాట్లాడారు. అంతర్జాతీయ వాణిజ్యం, ఇన్ఫ్రా పెట్టుబడుల విషయంలో నిబంధనలను సరళతరం చేయాల్సి ఉందన్నారు.అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే.. డబ్ల్యూటీఓ ట్రేడ్ ఫెసిలియేషన్ ఒప్పందం (టీఎఫ్ఏ) ఆమోదం, అమలు జరగాల్సి ఉందన్నారు. భారత్ ఇప్పటికీ డబ్ల్యూటీఓ ఒప్పందాన్ని ఆమోదించలేదని తెలిపారు. టీఎఫ్ఏ అమలు వల్ల అంతర్జాతీయ వాణిజ్యం ఊపందుకొని 3.6 బిలియన్ డాలర్లకు చేరుతుందని, దీంతో 2 కోట్ల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని పేర్కొన్నారు. -
ప్రపంచ చోదక శక్తిగా భారత్!
- చైనా స్థానాన్ని సొంతంచేసుకునే సత్తా ఉందన్న అరుణ్‌జైట్లీ - అయితే దీనికి 8-9 శాతం శ్రేణిలో వృద్ధి రేటు అవసరమని స్పష్టీకరణ న్యూఢిల్లీ: ప్రపంచ వృద్ధి ఇంజిన్ చోదకునిగా చైనా స్థానాన్ని సంపాదించే సత్తా భారత్‌కు ఉందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. అయితే ఇందుకు భారత్ తొలుత 8 నుంచి 9 శాతం శ్రేణిలో వృద్ధిరేటును సాధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గ్లోబల్ ఈక్విటీ, కరెన్సీ మార్కెట్లలో ఇటీవలి సంక్షోభాన్ని భారత్ తనకు సానుకూలంగా మార్చుకోవడం ద్వారా వృద్ధి వేగాన్ని పెంచుకోవచ్చన్నారు. అయితే ఇందుకు దేశంలో ఆర్థిక సంస్కరణలను పటిష్టవంతంగా ముందుకు నడిపించాల్సి ఉంటుందని అన్నారు. ఇందుకు కేంద్రం కట్టుబడి ఉందని కూడా స్పష్టం చేశారు. భారత్‌లో వ్యాపారాలకు అద్భుత అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే మోదీ ప్రభుత్వం ప్రపంచ ఇన్వెస్టర్లకు విశ్వాసం కల్పించిందని బీబీసీకి ఇచ్చిన ఒక ఇంటర్యూలో ఆయన అన్నారు. ఇన్వెస్టర్ అనుకూల వాతావరణం సృష్టికి కేంద్రం తగిన చర్యలు అన్నింటినీ తీసుకుంటోందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరమే దేశం 8 నుంచి 8.5 శాతం శ్రేణిలో వృద్ధిని సాధిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.