బ్లాక్‌స్టోన్‌తో మెగా డీల్‌ | Indiabulls Real Estatedivestment deal with Blackstone | Sakshi
Sakshi News home page

బ్లాక్‌స్టోన్‌తో మెగా డీల్‌

Published Mon, Mar 26 2018 2:44 PM | Last Updated on Mon, Mar 26 2018 2:44 PM

Indiabulls Real Estatedivestment deal with Blackstone - Sakshi

సాక్షి, ముంబై: రియల్టీ  సంస్థ ఇండియా బుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌  భారీ డీల్‌ చేసుకుంది.  గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ బ్లాక్‌స్టోన్‌ గ్రూపునకు తన అనుబంధ సంస్థల్లో 50 శాతం వాటాను విక్రయించాలని నిర్ణయించింది.  కమర్షియల్‌ ప్రాపర్టీస్‌లో   మేజర్‌వాటాను  విక్రయించేందుకు   ఈ మేరకు ఒక నిశ్చయాత్మక ఒప్పందంపై  సంతకాలు చేసింది.

తన అనుబంధ సంస్థలలోని మొత్తం హోల్డింగ్స్‌ను విక్రయించనుంది.   ఇండియాబుల్స్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్,  ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ లో 50 శాతం వాటాను పరోక్షంగా ఉపసంహరించుకుంది. దాదాపు రూ. 9,500 కోట్లకు  ఈ డీల్‌ చేసుకుంది. ఈ నిధుల ద్వారా అప్పులను  తీర్చడానికి ఉపయోగిస్తామని మార్కెట్‌ ఫైలింగ్‌లో తెలిపింది.   దీంతో  ఐబీ రియల్‌  4శాతానికి పైగా నష్టపోయింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement