Indiabulls Real Estate
-
ఐషర్ మోటార్స్- ఐబీ రియల్టీ.. హైజంప్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో అంచనాలకు తగిన ఫలితాలు సాధించడంతోపాటు.. ఆశావహ అంచనాల కారణంగా ఆటో రంగ కంపెనీ ఐషర్ మోటార్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోవైపు సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా వాటా కొనుగోలు చేసిన వార్తలతో ఇండియాబుల్స్ రియల్టీ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ ఆటుపోట్ల మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఐషర్ మోటార్స్ ఈ ఏడాది క్యూ2(జులై- ఆగస్ట్)లో ఐషర్ మోటార్స్ నికర లాభం 40 శాతం క్షీణించి రూ. 343 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 3 శాతం నీరసించి రూ. 2,134 కోట్లను తాకింది. రాయల్ ఎన్ఫీల్డ్ 9 శాతం తక్కువగా 1,49,120 మోటార్ సైకిళ్లను విక్రయించింది. వోల్వో గ్రూప్‌తో ఏర్పాటు చేసిన జేవీ వీఈ కమర్షియల్ వెహికల్స్ ఆదాయం 13 శాతం వెనకడుగుతో రూ. 1,703 కోట్లకు చేరింది. కాగా.. ఇబిటా మార్జిన్లు 5.4 శాతం నుంచి 6.9 శాతానికి బలపడ్డాయి. ప్రస్తుతం నెలకు 70,000 యూనిట్ల తయారీ స్థాయికి చేరినట్లు ఐషర్ మోటార్స్ యాజమాన్యం తాజాగా పేర్కొంది. బుకింగ్స్ సైతం 1.25 లక్షల యూనిట్లకు చేరినట్లు తెలియజేసింది. దీంతో క్యూ3లో పనితీరు మెరుగుపడే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐషర్ మోటార్స్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 6 శాతంపైగా జంప్‌చేసి రూ. 2,498ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా..ఈ షేరు గత వారం 15 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! చదవండి: (అరబిందో- ఐబీ హౌసింగ్- క్యూ2 ఖుషీ) ఐబీ రియల్టీ రాకేష్ జున్జున్వాలకు చెందిన రేర్ ఎంటర్ప్రైజెస్ ఓపెన్ మార్కెట్ ద్వారా ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన 5 మిలియన్ షేర్లను కొనుగోలు చేసింది. కంపెనీ ఈక్విటీలో 1.1 శాతం వాటాకు సమానమైన వీటిని గురువారం షేరుకి రూ. 57.73 ధరలో సొంతం చేసుకుంది. ఇందుకు దాదాపు రూ. 29 కోట్లను వెచ్చించినట్లు ఎన్ఎస్ఈ డేటా వెల్లడించింది. కాగా.. ఇదే సమయంలో మోర్గాన్ స్టాన్లీ 7.58 మిలియన్ షేర్లను రూ. 57.73 సగటు ధరలో విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఐబీ రియల్టీ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 16 శాతం దూసుకెళ్లింది. రూ. 64కు చేరింది. ప్రస్తుతం 12 శాతం లాభంతో రూ. 61.50 వద్ద ట్రేడవుతోంది. గత రెండు రోజుల్లో ఈ కౌంటర్ 30 శాతంపైగా లాభపడటం విశేషం! -
బ్లాక్‌స్టోన్‌తో మెగా డీల్
సాక్షి, ముంబై: రియల్టీ సంస్థ ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ భారీ డీల్ చేసుకుంది. గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ బ్లాక్‌స్టోన్ గ్రూపునకు తన అనుబంధ సంస్థల్లో 50 శాతం వాటాను విక్రయించాలని నిర్ణయించింది. కమర్షియల్ ప్రాపర్టీస్‌లో మేజర్‌వాటాను విక్రయించేందుకు ఈ మేరకు ఒక నిశ్చయాత్మక ఒప్పందంపై సంతకాలు చేసింది. తన అనుబంధ సంస్థలలోని మొత్తం హోల్డింగ్స్‌ను విక్రయించనుంది. ఇండియాబుల్స్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ లో 50 శాతం వాటాను పరోక్షంగా ఉపసంహరించుకుంది. దాదాపు రూ. 9,500 కోట్లకు ఈ డీల్ చేసుకుంది. ఈ నిధుల ద్వారా అప్పులను తీర్చడానికి ఉపయోగిస్తామని మార్కెట్ ఫైలింగ్‌లో తెలిపింది. దీంతో ఐబీ రియల్ 4శాతానికి పైగా నష్టపోయింది. -
ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ ట్రేడింగ్‌పై ఎన్ఎస్ఈ కన్ను
న్యూఢిల్లీ: ఇండియాబుల్స్ రియల్ఎస్టేట్ షేర్ ట్రేడింగ్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆ కంపెనీ షేర్‌ట్రేడింగ్ డేటాపై ఎన్ఎస్ఈ పరిశీలన చేయనున్నది. గత రెండు రోజులుగా ఈ షేర్ తీవ్రమైన ఒడిదుడుకులకు గురైన విషయం తెలిసిందే. సోమవారం ఒక్కరోజే 40 శాతం పెరిగిన ఈ షేర్ మంగళవారం 10 శాతం పతనమై రూ.133 వద్ద ముగిసింది. అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చినప్పుడు సదరు షేర్ ట్రేడింగ్ డేటాపై ఎన్ఎస్ఈ సాధారణంగానే ఈ తరహా పరిశీలన చేపడుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ పరిశీలనలో ఏమైనా తప్పు జరిగినట్లు తేలితే, ఆ విషయాన్ని మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీకి నివేదించడం జరుగుతుందని ఆ వర్గాలు వివరించాయి. -
దూసుకుపోయిన రియల్టీ రంగం
ముంబై: రియల్ ఎస్టేట్ దిగ్గజం ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ కీలక ప్రకటనతో మార్కెట్లో రియల్టీ షేర్లు దూకుడును ప్రదర్శించాయి. సోమవారంనాటి మార్కెట్ లో ఇండియా బుల్స్ రికార్డ్ స్థాయిని నమోదు చేసింది. ఐబీ రియల్టీ 40 శాతానికిపైగా పుంజుకుని ఇంట్రా డేలో ఏప్రిల్ 20, 2011 నాటి స్తాయిని తాకింది. దీంతో రియల్టీ రంగం కూడా దూసుకుపోయింది. ఈ అనూహ్య డిమాండ్ నేపథ్యంలో రియల్టీ ఇండెక్స్ రెండేళ్ల గరిష్టానికి చేరింది. ప్రధానంగా బిజినెస్ పునర్వ్యవస్థీకరణ ప్రకటించిన ఇండియాబుల్స్ రియల్టీ కౌంటర్ భారీగా దూసుకెళ్లి ఈ రంగానికి కిక్ ఇచ్చింది. దీంతో రియల్టీ ఇండెక్స్ కూడా 6.5 శాతం జంప్‌చేసింది. ఇదేబాటలోఇతర రియల్టీ షేర్లు కూడా పయనించాయి. ముఖ్యంగా హెచ్‌డీఐఎల్ 9.6 శాతం, డీఎల్ఎఫ్ దాదాపు 7 శాతం ఎగిశాయి. వీటితోపాటు యూనిటెక్, గోద్రెజ్ ప్రాపర్టీస్, శోభా, డెల్టాకార్ప్, ఫీనిక్స్, ఒబెరాయ్ 6-1.3 శాతంమధ్య లాభపడ్డాయి. డీబీ రియల్టీ, అన్సల్ ప్రాపర్టీస్, నితీష్ ఎస్టేట్స్, కోల్టేపాటిల్, ఏషియానా హౌసింగ్, ఓమాక్స్ 8-5 శాతం మధ్య పుంజుకోవడం విశేషం.