ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ ట్రేడింగ్‌పై ఎన్‌ఎస్‌ఈ కన్ను
న్యూఢిల్లీ: ఇండియాబుల్స్ రియల్‌ఎస్టేట్ షేర్ ట్రేడింగ్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆ కంపెనీ షేర్‌ట్రేడింగ్ డేటాపై ఎన్‌ఎస్‌ఈ పరిశీలన చేయనున్నది. గత రెండు రోజులుగా ఈ షేర్ తీవ్రమైన ఒడిదుడుకులకు గురైన విషయం తెలిసిందే. సోమవారం ఒక్కరోజే 40 శాతం పెరిగిన ఈ షేర్ మంగళవారం 10 శాతం పతనమై రూ.133 వద్ద ముగిసింది. అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చినప్పుడు సదరు షేర్ ట్రేడింగ్ డేటాపై ఎన్‌ఎస్‌ఈ సాధారణంగానే ఈ తరహా పరిశీలన చేపడుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ పరిశీలనలో ఏమైనా తప్పు జరిగినట్లు తేలితే, ఆ విషయాన్ని మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీకి నివేదించడం జరుగుతుందని ఆ వర్గాలు వివరించాయి.