దూసుకుపోయిన రియల్టీ రంగం
ముంబై: రియల్ ఎస్టేట్ దిగ్గజం ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ కీలక ప్రకటనతో మార్కెట్లో రియల్టీ షేర్లు దూకుడును ప్రదర్శించాయి. సోమవారంనాటి మార్కెట్ లో ఇండియా బుల్స్ రికార్డ్ స్థాయిని నమోదు చేసింది. ఐబీ రియల్టీ 40 శాతానికిపైగా పుంజుకుని ఇంట్రా డేలో ఏప్రిల్ 20, 2011 నాటి స్తాయిని తాకింది. దీంతో రియల్టీ రంగం కూడా దూసుకుపోయింది. ఈ అనూహ్య డిమాండ్ నేపథ్యంలో రియల్టీ ఇండెక్స్ రెండేళ్ల గరిష్టానికి చేరింది.
ప్రధానంగా బిజినెస్ పునర్వ్యవస్థీకరణ ప్రకటించిన ఇండియాబుల్స్ రియల్టీ కౌంటర్ భారీగా దూసుకెళ్లి ఈ రంగానికి కిక్ ఇచ్చింది. దీంతో రియల్టీ ఇండెక్స్ కూడా 6.5 శాతం జంప్‌చేసింది. ఇదేబాటలోఇతర రియల్టీ షేర్లు కూడా పయనించాయి. ముఖ్యంగా హెచ్‌డీఐఎల్ 9.6 శాతం, డీఎల్‌ఎఫ్ దాదాపు 7 శాతం ఎగిశాయి. వీటితోపాటు యూనిటెక్, గోద్రెజ్ ప్రాపర్టీస్, శోభా, డెల్టాకార్ప్, ఫీనిక్స్, ఒబెరాయ్ 6-1.3 శాతంమధ్య లాభపడ్డాయి. డీబీ రియల్టీ, అన్సల్ ప్రాపర్టీస్, నితీష్ ఎస్టేట్స్, కోల్టేపాటిల్, ఏషియానా హౌసింగ్, ఓమాక్స్ 8-5 శాతం మధ్య పుంజుకోవడం విశేషం.