Black Stone
-
ట్రెండ్ సెటర్ సీఈవో సరికొత్త చరిత్ర: గంటకు రూ.12 కోట్లు
వాషింగ్టన్: గంటకు 12 కోట్లు సంపాదించడం అంటే చిన్న విషయం కాదు కదా. కానీ అమెరికాలోని ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సంస్థ బ్లాక్‌స్టోన్ సీఈవో స్టీఫెన్ స్క్వార్జ్మాన్ (76) ఈ ఫీట్ సాధించింది. 2022లో అత్యధిక సంపదను కూడబెట్టుకుని మరోసారి రికార్డు క్రియేట్ చేశారు. గత ఏడాది ఏకంగా 1.27 బిలియన్ డాలర్లు సంపాదించారు. 2021లో స్క్వార్జ్మాన్ వార్షిక ఆదాయం 1.1 బిలియన్ డాలర్లుగా ఉంది. తాజా నివేదికల ప్రకారం ఇన్వెస్టింగ్ టైటాన్ స్క్వార్జ్మాన్ 2022లో అతని సంపాదన గంటకు రూ. 12 కోట్లు. వాల్‌స్ట్రీట్‌లో ఆయనదే రికార్డు అని బిజినెస్ వర్గాలు తెలిపాయి. బ్లాక్‌స్టోన్ షేర్లలో దాదాపు 20శాతం ఉన్న ఆయనకు 1 బిలియన్ డాలర్ల డివిడెండ్, 253.1 మిలియన్ల డాలర్ల ఇతర ప్రయోజనాలను పొందారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం బ్లాక్‌స్టోన్ సీఈవో నికర విలువ 30.6 బిలియన్ డాలర్లు. 2021లో ఏకంగా రూ.8,500 కోట్ల వేతనంతో వాల్‌స్ట్రీట్‌లో అత్యధిక వేతనం అందుకున్న సీఈవోగా రికార్డు బద్దలు కొట్టారు. 2022లో ఎస్ అండ్ పీ 500 8.2 శాతం క్షీణించగా, బ్లాక్‌స్టోన్ షేర్ల నష్టాలు 1.5 శాతానికి పరిమితం కావడం విశేషం.స్టీఫెన్ వారసుడు బ్లాక్‌స్టోన్ ప్రెసిడెంట్ జోన్ గ్రే, 2022లో 479.2 మిలియన్ల డాలర్లు ఆర్జించాడు. బ్లాక్‌స్టోన్‌లో 3 శాతం వాటా, డివిడెండ్ ఆదాయం కలిపి 182.7 మిలియన్లు అతని నికర విలువకు చేరాయి. కాగా స్టీఫెన్ స్క్వార్జ్మాన్ ఫిబ్రవరి 14,1947న జన్మించారు. 1985లో ఏర్పాటైన బ్లాక్‌స్టోన్‌కు స్టీఫెన్ సహ వ్యవస్థాపకుడు. లెమాన్ బ్రదర్స్ మాజీ ఛైర్మన్, సీఈవో పీటర్సన్‌తో కలిసి 1985లో ది బ్లాక్‌స్టోన్ గ్రూప్ అనే గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థను స్థాపించారు స్క్వార్జ్మాన్ . -
బ్లాక్‌స్టోన్ చేతికి ఇండియాబుల్స్ చెన్నై ప్రాపర్టీ
న్యూఢిల్లీ: ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ చెన్నైలోని ఆఫీస్ ప్రాపర్టీని అంతర్జాతీయ ఇన్వెస్టర్ బ్లాక్‌స్టోన్‌కు విక్రయించింది. వాణిజ్య ఆస్తుల విక్రయంలో భాగంగా చెన్నైలోని అంబత్తూర్‌లోని ఈ ప్రాపర్టీని విక్రయించినట్లు ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ తెలిపింది. ఈ డీల్ విలువ రూ.850 కోట్లని, వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 కల్లా పూర్తవుతుందని పేర్కొంది. 1.9 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌తో కూడిన చెన్నైలోని ఈ ‘వన్ ఇండియాబుల్స్ పార్క్’ దాదాపు పూర్తయిందని, వార్షికంగా రూ.85 కోట్ల అద్దె ఆదాయం లభిస్తుందని వివరించింది. ఈ కంపెనీ ఈ ఏడాది మార్చిలో ముంబైలోని రెండు ప్రధాన వాణిజ్య ఆస్తుల్లో 50 శాతం వాటాను ఇదే సంస్థలకు రూ.3,750 కోట్లకు విక్రయించింది. అమెరికాకు చెందిన బ్లాక్‌స్టోన్ సంస్థ నేరుగా, జాయింట్ వెంచర్ భాగస్వామి ఎంబసీ గ్రూప్‌తో కలసి భారత్‌లోని ప్రధాన నగరాల్లో మొత్తం 6 కోట్ల చదరపుటడుగుల వాణిజ్య ఆస్తులను కొనుగోలు చేసింది. -
బ్లాక్‌స్టోన్‌తో మెగా డీల్
సాక్షి, ముంబై: రియల్టీ సంస్థ ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ భారీ డీల్ చేసుకుంది. గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ బ్లాక్‌స్టోన్ గ్రూపునకు తన అనుబంధ సంస్థల్లో 50 శాతం వాటాను విక్రయించాలని నిర్ణయించింది. కమర్షియల్ ప్రాపర్టీస్‌లో మేజర్‌వాటాను విక్రయించేందుకు ఈ మేరకు ఒక నిశ్చయాత్మక ఒప్పందంపై సంతకాలు చేసింది. తన అనుబంధ సంస్థలలోని మొత్తం హోల్డింగ్స్‌ను విక్రయించనుంది. ఇండియాబుల్స్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ లో 50 శాతం వాటాను పరోక్షంగా ఉపసంహరించుకుంది. దాదాపు రూ. 9,500 కోట్లకు ఈ డీల్ చేసుకుంది. ఈ నిధుల ద్వారా అప్పులను తీర్చడానికి ఉపయోగిస్తామని మార్కెట్ ఫైలింగ్‌లో తెలిపింది. దీంతో ఐబీ రియల్ 4శాతానికి పైగా నష్టపోయింది. -
వివేక స్రష్ట ముహమ్మద్ (స)
ఐదు రోజులు గడిచినా సమస్య ఓ కొలిక్కి రాలేదు. ఎవరికివారు ‘హజ్రె అస్వద్’ను ప్రతిష్టించే హక్కు తమకే ఉందని పట్టుబట్టారు. ఎవరూ వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడంలేదు. రణరంగానికి రంగం సిధ్ధమైంది. పిడికిళ్ళు బిగుసుకున్నాయి. కరవాలాలు ఒరల్లోంచి సర్రున బయటికి కొచ్చాయి...అంతలో.. ‘ఆగండి’ అంటూ మారు మోగిందో కంఠం. అందరూ గిర్రున తిరిగి ఎవరా అని చూశారు. ఆ పెద్దమనిషి ఖుైరె ష్ తెగలోని కురు వృద్ధుడు. అబూ ఉమయ్యాబిన్ ముగీరా. అందరూ అతన్ని గౌరవిస్తారు. ఆయన మాట ఎవరూ కాదనరు. అందరూ అతని వైపు ప్రశ్నార్ధకంగా చూశారు. ‘గౌరవోన్నతుల విషయంలో మీరు ఎవరూ ఎవరికీ తక్కువ కారు. అంతా సమాన హోదా కలిగిన వారే. దైవ గృహంలో అనవసర రక్తపాతం మంచిదికాదు. విచక్షణా జ్ఞానంతో ఆలోచించండి. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తేకండి. నా సలహా ఏమిటంటే, సఫా ద్వారం నుండి మొట్టమొదట ఎవరైతే కాబాగృహంలోకి అడుగు పెడతారో వారిని న్యాయనిర్ణేతగా ఎంచుకోండి. అతను చెప్పిన తీర్పుకు కట్టుబడి ఉండండి.’ అన్నాడు పెద్దాయన ఉమయ్యా. ‘ఈ సలహా మాకు సమ్మతమే’ అన్నారు అందరూ ముక్తకంఠంతో. తరువాత కొంత సమయం గడిచి పోయింది. అందరూ ఊపిరి బిగబట్టి సఫా ద్వారంవైపే చూస్తున్నారు. అంతలో వారి ఉత్కంఠకు తెరలేపుతూ ఓ అందమైన యువకిశోరం ఆ ద్వారం గుండా కాబాలో అడుగుపెట్టాడు. అంతా ఒక్కసారిగా ‘అమీన్.. అమీన్.. ముహమ్మద్ .. ముహమ్మద్.. అమీన్ ’ అంటూ ఆనందంతో ఎగిరి గంతేసినంత పనిచేశారు. ఎంత నమ్మకం..! ఎంత విశ్వసనీయత..!! మక్కా మాత్రమేకాదు, మొత్తం అరేబియా వెదికినా అలాంటి నిజాయితీ పరుడు, సత్యసంధుడు, విశ్వసనీయుడు మరొకరు దొరకరు. ఆయన ఎలాంటి తీర్పుచెప్పినా ప్రజలు దాన్ని కిమ్మనకుండా శిరసావహించవలసిందే. చూడాలిక ఈ విషయంలో ఆయన తీర్పు ఎలా ఉండబోతోందో..! ముహమ్మద్ (స)కు ఏమీ అర్ధంగాక అయోమయంగా చూశారు. అంతలో వివిధ తెగలకు చెందిన అగ్రనాయకులంతా ఆయన చుట్టూ మూగి, సమస్యను వివరించి, పరిష్కరించమని విన్నవించుకున్నారు. వెంటనే ముహమ్మద్ దుప్పటిలాంటి ఒక వస్త్రం తెప్పించి నేలపై పరిచారు. తానే స్వయంగా ‘హజ్రెఅస్వద్’ దానిపైన పెట్టారు. తరువాత పోటీ పడుతున్న అన్నితెగలనుండీ ఒక్కొక్క నేతను పిలిచి అందరితో దుప్పటి చెంగుల్ని పట్టించారు. అన్నితెగలవారూ ‘హజ్రె అస్వద్’ను పట్టుకొని అమర్చవలసిన చోటుకి తెచ్చారు. తరువాత ముహమ్మద్ తన స్వహస్తాలతో కాబా గోడలో దాన్ని అమర్చారు. అనంతరం కాబానిర్మాణం దిగ్విజయంగా పూర్తయింది. - మహమ్మద్ ఉస్మాన్‌ఖాన్ -
యాదాద్రికి గురిజాపల్లి ‘కృష్ణశిల’
♦ రాజగోపురం, పిల్లర్లకు ప్రకాశం జిల్లా రాయిని ఎంపిక చేసిన వైటీడీఏ ♦ త్వరలోనే ప్రారంభం కానున్న రాతి పనులు సాక్షి ప్రతినిధి, నల్లగొండ: యాదాద్రి క్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంలో తొలి అంకం ముగిసింది. స్వయంభు నారసింహుడి గర్భగుడిని మూసివేసి ఆధునికీకరణ పనులను ప్రారంభించేందుకుగాను భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేసిన బాలాలయ ప్రతిష్ఠాపన మహోత్సవం గురువారం వైభ వంగా జరిగింది. యాదాద్రి ఆధునికీకరణ పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆలయ రాజగోపురం, ప్రధాన ఆలయ ప్రాకారాలను నిర్మించేందుకు గాను అనేక తర్జన భర్జనల అనంతరం ప్రకాశం జిల్లా గురిజాపల్లిలో లభించే ‘కృష్ణశిల’ (బ్లాక్ స్టోన్)ను ఉపయోగించాలని 14 మంది సభ్యులు గల యాదా ద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వైటీడీఏ) నిర్ణయిం చింది. దేశంలోని వివిధ వైష్ణవాలయాలకు ఉపయోగించిన రాళ్లను అధ్యయనం చేయడంతో పాటు తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాల్లో ఉన్న రాళ్లను వైటీడీఏ వైస్‌చైర్మన్ కిషన్‌రావు, ఆలయ స్థపతి సుందర రాజన్, ప్రధాన ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి, ఆలయ ఈవో గీతారెడ్డి పరిశీలించిన అనంతరం ఈ గురిజాపల్లి నల్లరాయిని ఉపయోగించాలని నిర్ణయించినట్టు తెలిసింది. మిగిలిన పనులను నల్లగొండ జిల్లా భువనగిరి సమీపంలోని రాయగిరి రాళ్లతోనే చేయనున్నారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని వైటీడీఏ అధికారి చెప్పారు.