చెన్నై: ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ 2017–18 నాలుగో త్రైమాసిక కాలంలో స్టాండ్ అలోన్ ప్రాతిపదికన రూ.132 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో వచ్చిన నికర లాభం రూ.320 కోట్లతో పోలిస్తే 59 శాతం క్షీణించిందని ఇండియన్ బ్యాంక్ ఎమ్‌డీ, సీఈఓ కిశోర్ కారత్ చెప్పారు. మొత్తం ఆదాయం రూ.4,602 కోట్ల నుంచి రూ.4,954 కోట్లకు పెరిగింది. మొండి బకాయిలు రూ.2,988 కోట్లకు పెరిగాయి. రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.6 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు.
రూ.2,000 కోట్ల ‘మొండి’ రికవరీలు..!
స్థూల మొండి బకాయిలు 7.47 శాతం నుంచి 7.37 శాతానికి తగ్గాయి. అయినప్పటికీ మొండి బకాయిలకు కేటాయింపులు మూడు రెట్లు పెరిగాయని కారత్ చెప్పారు. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.608 కోట్ల నుంచి రూ.1,772 కోట్లకు ఎగిశాయని, నికర మొండి బకాయిలు 4.39 శాతం నుంచి 3.81 శాతానికి తగ్గాయని తెలియజేశారు. నికర మొండి బకాయిలు 3 శాతంలోపు తగ్గించడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రూ.2,000 కోట్ల మొండి బకాయిలను రికవరీ చేయగలమని చెప్పారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.1,406 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 11 శాతం క్షీణించి రూ.1,259 కోట్లకు తగ్గింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఇండియన్ బ్యాంక్ షేర్ 8 శాతం నష్టంతో రూ. 314 వద్ద ముగిసింది.
ఇండియన్ బ్యాంక్ లాభం 59 శాతం డౌన్
Published Fri, May 11 2018 12:47 AM | Last Updated on Fri, May 11 2018 12:47 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment