సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించిన చర్యలు ఊతమిచ్చాయి. కరోనా కల్లోలంతో ఇటీవలి రికార్డు పతనాన్ని నమోదు చేసిన రూపాయి డాలరు మారకంలో 45 పైసలు పుంజుకుంది. 76.59 వద్ద ప్రారంభమైన రూపాయి గవర్నర్ శక్తికాంత దాస్ మీడియా సమావేశం అనంతరం మరింత పుంజుకుని 76.42 గరిష్టాన్ని తాకింది. గురువారం, అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 76.87 కనిష్ట స్థాయి వద్ద స్థిరపడింది. సానుకూల దేశీయ ఈక్విటీలు, డాలరు బలహీనతకు తోడు, ఆర్‌బీఐ ప్రకటించిన ద్రవ్య లభ్యత , ఆర్థిక పటిష్టతకు తీసుకున్న చర్యలు రూపాయికి మద్దతిచ్చినట్టు ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. మరోవైపు ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధర (బ్రెంట్ ఫ్యూచర్స్) 2.05 శాతం పెరిగి బ్యారెల్ 28.39 డాలర్లకు చేరుకుంది. (కరోనా సంక్షోభం : టీసీఎస్ కీలక నిర్ణయం)
కోవిడ్-19 మహమ్మారి వల్ల కలిగే ఆర్థిక ఒత్తిడిని తగ్గించడానికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ వ్యవస్థలో తగిన ద్రవ్యత ఉండేలా చర్యలు ప్రకటించారు. ఆర్థిక మందగమనానికి వ్యతిరేకంగా లిక్విడిటీని పెంపు, క్యాష్ ఫ్లోకు మద్దతు లాంటి అదనపు చర్యలను ఆర్బిఐ ప్రకటించింది. నాబార్డ్, నేషనల్ హౌసింగ్ బ్యాంక్, సిడ్బీ వంటి ఆర్థిక సంస్థలకు రూ .50 వేల కోట్ల రీ ఫైనాన్సింగ్ విండో, రివర్స్ రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల లాంటి చర్యలను ఆర్‌బీఐ తీసుకుంది. మరోవైపు ఆర్‌బీఐ మీడియా సమావేశం వార్తలో దాదాపు వెయ్యి పాయింట్లకుపైగా ఎ గిసిన సెన్సెక్స్ ప్రస్తుతం 563 పాయింట్ల లాభానికి పరిమితం కాగా నిఫ్టీ 160 పాయింట్ల లాభంతో 9149 వద్ద 9200 స్థాయి దిగువకు చేరింది. ప్రధానంగా ఎన్‌బీఎఫ్‌సీలకు అవసరమైన ద్రవ్య లభ్యతకోసం భారీ ఉద్దీపన ప్యాకేజీ కోసం ఎదురుచూసినట్టు ఐఎఫ్ఎ గ్లోబల్ వ్యవస్థాపకుడు సీఈవో, అభిషేక్ గోయెంకా అన్నారు. (రివర్స్ రెపో రేటు పావు శాతం కోత)
చదవండి : 76.80 స్థాయికి పడిపోయిన రూపాయి
Comments
Please login to add a commentAdd a comment