ఇండస్‌ఇండ్‌ లాభాలకు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గండి | IndusInd Bank net profit rises to ₹920 crore | Sakshi
Sakshi News home page

ఇండస్‌ఇండ్‌ లాభాలకు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గండి

Published Tue, Oct 16 2018 12:37 AM | Last Updated on Tue, Oct 16 2018 12:37 AM

IndusInd Bank net profit rises to ₹920 crore - Sakshi

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగంలోని ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలం(2018–19, క్యూ2)లో రూ.920 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం(రూ.880 కోట్లు)తో పోల్చితే 5 శాతం వృద్ధి సాధించామని ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ తెలిపింది.

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌కు రుణాలివ్వడంతో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ నికర లాభానికి గండి పడింది. ఈ గ్రూప్‌కు ఎంత మొత్తంలో రుణాలిచ్చింది వెల్లడించని ఈ బ్యాంక్‌ ఈ బకాయిల కోసం రూ.275 కోట్లు కేటాయింపులు జరిపింది. ఈ కేటాయింపులు కూడా కలుపుకుంటే నికర లాభం 25 శాతం పెరిగేదని బ్యాంక్‌ ఎమ్‌డీ, సీఈఓ రమేశ్‌ సోబ్తి పేర్కొన్నారు. గత క్యూ2లో రూ.5,395 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.6,755 కోట్లకు ఎగసిందని తెలిపారు.  

నికర వడ్డీ ఆదాయం 21 శాతం అప్‌....
నికర వడ్డీ ఆదాయం 21 శాతం పెరిగి రూ.2,203 కోట్లకు, ఫీజు ఆదాయం 20% వృద్ధితో రూ.1,218 కోట్లకు  పెరిగిందని సోబ్తి పేర్కొన్నారు. అయితే నికర వడ్డీ మార్జిన్‌ 4 శాతం నుంచి 3.88 శాతానికి తగ్గిందని తెలిపారు. సీక్వెన్షియల్‌గా చూస్తే రుణ నాణ్యత మెరుగుపడిందని వివరించారు.

గత క్యూ2లో 1.08 శాతంగా, ఈ క్యూ1లో 1.15 శాతంగా  ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో  1.09 శాతానికి చేరాయని తెలిపారు. ఈ క్యూ1లో 0.51 శాతంగా ఉన్న నికర మొండి బకాయిలు ఈ సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 0.48 శాతానికి తగ్గాయని తెలిపారు.  కేటాయింపులు రూ.294 కోట్ల నుంచి రెట్టింపై రూ.590 కోట్లకు చేరుకున్నాయి.

నిర్వహణ లాభం రూ.1,992 కోట్లు....
రుణ వృద్ధి 32%, డిపాజిట్లు 19% చొప్పున వృద్ధి చెందాయని సోబ్తి తెలిపారు. కార్పొరేట్, రిటైల్‌ రుణాలు వేగవంతమైన వృద్ధిని సాధించాయని వివరించారు. ఇతర ఆదాయం 11% వృద్దితో రూ.1,317 కోట్లకు, నిర్వహణ లాభం 22% వృద్ధితో రూ.1,992 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు.  ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్‌ 1.4 శాతం నష్టంతో రూ.1,627 వద్ద ముగిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement