ఇన్ఫినిట్ అనలిటిక్స్‌లో రతన్ టాటా పెట్టుబడులు | Infinite analytics investments Ratan Tata | Sakshi
Sakshi News home page

ఇన్ఫినిట్ అనలిటిక్స్‌లో రతన్ టాటా పెట్టుబడులు

Published Tue, Sep 1 2015 2:51 AM | Last Updated on Sun, Sep 3 2017 8:29 AM

ఇన్ఫినిట్ అనలిటిక్స్‌లో రతన్ టాటా పెట్టుబడులు

ఇన్ఫినిట్ అనలిటిక్స్‌లో రతన్ టాటా పెట్టుబడులు

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తాజాగా ఇన్ఫినిట్ అనలిటిక్స్ సంస్థలో పెట్టుబడి పెట్టారు...

న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తాజాగా ఇన్ఫినిట్ అనలిటిక్స్ సంస్థలో పెట్టుబడి పెట్టారు. అయితే, ఆయన ఎంత ఇన్వెస్ట్ చేసినదీ వెల్లడి కాలేదు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన సిక్స్త్ సెన్స్ వెంచర్స్‌కి చెందిన నిఖిల్ వోరా తదితరులు మరో దఫా ఇన్వెస్ట్ చేసినట్లు ఇన్ఫినిట్ అనలిటిక్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రెడిక్టివ్ టెక్నాలజీ సేవలు అందించే ఇన్ఫినిట్ 2012లో ఏర్పాటైంది. ఎయిర్‌బీఎన్‌బీ, కామ్‌కాస్ట్, బేబీఓయ్, ఎన్‌డీటీవీ రిటైల్ తదితర సంస్థలకు సర్వీసులు అందిస్తోంది. మరోవైపు, రతన్ టాటా ఇన్వెస్ట్ చేయడం తమ కంపెనీ అభివృద్ధికి తోడ్పడగలదని ఇన్ఫినిట్ సహ వ్యవస్థాపకుడు ఆకాశ్ భాటియా పేర్కొన్నారు. టాటా ఇప్పటిదాకా స్నాప్‌డీల్, కార్యా, అర్బన్ ల్యాడర్, బ్లూస్టోన్ తదితర సంస్థల్లో ఇన్వెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement