
‘ట్రాక్షన్’లో రతన్ టాటా పెట్టుబడి
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తాజాగా రీసెర్చ్ సంస్థ ట్రాక్షన్‌లో ఇన్వెస్ట్ చేశారు.
రూ.1.6 కోట్ల లాభాల జప్తునకు ఆదేశాలు
ముంబై: పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తాజాగా రీసెర్చ్ సంస్థ ట్రాక్షన్‌లో ఇన్వెస్ట్ చేశారు. అయితే, ఎంత పెట్టుబడి పెట్టినదీ వెల్లడి కాలేదు. నేహా సింగ్, అభిషేక్ గోయల్ 2013లో ట్రాక్షన్‌ను ప్రారంభించారు. డేటా విశ్లేషణ ఆధారంగా పెట్టుబడులకు ఆకరణీయమైన కంపెనీలను గుర్తించి.. వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు మొదలైన వాటికి ఈ సంస్థ తోడ్పాటు అందిస్తోంది. 2015 ఏప్రిల్‌లో ట్రాక్షన్.. సైఫ్ పార్ట్‌నర్స్ నుంచి 3.5 మిలియన్ డాలర్లు సమీకరించింది. అనలిస్టుల సంఖ్యను 25 నుంచి 125కి పెంచుకుంది. ఆండ్రీఎసెన్ హొరోవిట్జ్, సెకోయా, సాఫ్ట్‌బ్యాంక్, గూగుల్ క్యాపిటల్, వీఎంవేర్, జీఈ, ఎల్‌జీ వంటి కంపెనీలకు ట్రాక్షన్ సర్వీసులు అందిస్తోంది.
మార్స్‌తో టాటా ట్రస్ట్స్ జట్టు..
వ్యవసాయ రంగ అభివృద్ధి, పోషకాహార లోపాల సమస్య పరిష్కారంపై కృషి చేసే దిశగా అంతర్జాతీయ సంస్థ మార్స్‌తో టాటా ట్రస్ట్స్ చేతులు కలిపింది. వ్యవసాయోత్పత్తి, వ్యవసాయ రంగం ఆదాయాలు పెంచడం తదితర అంశాలకు తోడ్పడే సాధనాలను రూపొందించేందుకు ఇరు సంస్థలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. దేశప్రజలకు దీర ్ఘకాల ప్రయోజనాలు చేకూర్చేందుకు ఇది దోహదపడగలదని టాటా ట్రస్ట్స్ చైర్మన్ రతన్ టాటా, మార్స్ ఫుడ్ సంస్థ ప్రెసిడెంట్ ఫియోనా డాసన్ పేర్కొన్నారు. అమెరికాకు చెందిన మార్స్‌కు.. ఆహార, పానీయాలు తదితర ఉత్పత్తుల విభాగాల్లో 33 బిలియన్ డాలర్ల వ్యాపారం ఉంది.
ఐడియా ఆసక్తికరంగా ఉంటేనే ఇన్వెస్ట్ చేస్తా: రతన్
ముంబై: ఐడియా ఆసక్తికరంగా ఉండి, వ్యవస్థాపకులపై ప్రారంభంలోనే సదభిప్రాయం కలిగితేనే కొత్త కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తానని, అలా లేకపోతే చేయనని పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా వెల్లడించారు. స్టార్టప్ కంపెనీలు సృజనాత్మకతకు, నూతన ఆవిష్కరణలకు పట్టుకొమ్మలని ఆయన వ్యాఖ్యానించారు. ఔత్సాహిక యువ వ్యాపారవేత్తలతో టైకాన్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా టాటా ఈ విషయాలు తెలిపారు. ఇటీవలి కాలంలో దాదాపు 20 పైగా స్టార్టప్‌లలో రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, టైకాన్ తొలి రోజున వెయ్యి మంది పైగా దేశీ, విదేశీ సీఎక్స్‌వోలు, వ్యాపారవేత్తలు, ఇన్వెస్టర్లు తదితరులు పాల్గొన్నారు.