
మోగ్లిక్స్ లో రతన్ టాటా పెట్టుబడులు
స్టార్టప్ సంస్థల్లో పెట్టుబడుల పరంపరను కొనసాగిస్తూ.. పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తాజాగా మరో సంస్థ మోగ్లిక్స్‌లో ఇన్వెస్ట్ చేశారు.
న్యూఢిల్లీ: స్టార్టప్ సంస్థల్లో పెట్టుబడుల పరంపరను కొనసాగిస్తూ.. పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తాజాగా మరో సంస్థ మోగ్లిక్స్‌లో ఇన్వెస్ట్ చేశారు. పారిశ్రామిక ఉత్పత్తులకు సంబంధించి ఈ-కామర్స్ కంపెనీ అయిన మోగ్లిక్స్‌ను 2015 ఆగస్టులో గూగుల్ మాజీ ఉద్యోగి రాహుల్ గర్గ్ ప్రారంభించారు. మోగ్లిక్స్ ఇటీవలే యాక్సెల్ పార్ట్‌నర్స్, జంగిల్ వెంచర్స్ తదితర ఫండ్స్ నుంచి నిధులు సమీకరించింది. సంస్థ వ్యాపార వృద్ధి, విస్తరణ తదితర అంశాల్లో రతన్ టాటా తగు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. ఆయన ఈ ఏడాది ఇప్పటిదాకా డాగ్‌స్పాట్‌డాట్‌ఇన్, ట్రాక్సన్, క్యాష్‌కరో, ఫస్ట్‌క్రై, టీబాక్స్ మొదలైన అయిదు సంస్థల్లో ఇన్వెస్ట్ చేశారు.