‘ఫ్రీడమ్ 251’ స్మార్ట్ ఫోన్స్ రాకపోతే..
చర్యలు తప్పవు: రవి శంకర్ ప్రసాద్
న్యూఢిల్లీ: రింగింగ్ బెల్స్ కంపెనీ ‘ఫ్రీడమ్ 251’ స్మార్ట్‌ఫోన్స్ వినియోగదారులకు అందించడంలో విఫలమైతే.. అది తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ‘ఫ్రీడమ్ 251’ ఉదంతాన్ని నిశితంగా గమనిస్తోందన్నారు. రింగింగ్ బెల్స్ కంపెనీ ‘ఫ్రీడవ్ 251’ స్మార్ట్‌ఫోన్‌ను ఎలా తయారు చేస్తుంది? రూ.251లకు ఆ స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తుందా? బీఐఎస్ సర్టిఫికేట్ ఉందా? లేదా? వంటి తదితర అంశాలపై తమ మంత్రిత్వశాఖ విచారణ జరుపుతోందని వివరించారు. ఆదాయపు పన్ను శాఖ కూడా రింగింగ్ బెల్స్ కంపెనీ ఆర్థిక వ్యవహారాలను పరిశీలిస్తోంది.