రూ. 251 ఫోన్లాగే.. చవగ్గా టీవీ ఇస్తాం! | ringing bells to launch freedom tv in lines of freedom 251 smart phone | Sakshi
Sakshi News home page

రూ. 251 ఫోన్లాగే.. చవగ్గా టీవీ ఇస్తాం!

Published Wed, Jul 6 2016 10:53 AM | Last Updated on Mon, Sep 4 2017 4:16 AM

రూ. 251 ఫోన్లాగే.. చవగ్గా టీవీ ఇస్తాం!

రూ. 251 ఫోన్లాగే.. చవగ్గా టీవీ ఇస్తాం!

ఫ్రీడమ్ 251.. ఈ పేరుతో అత్యంత చవగ్గా కేవలం 251 రూపాయలకే ఆండ్రాయిడ్ ఫోన్ ఇస్తామంటూ ఊదరగొట్టిన రింగింగ్ బెల్స్ సంస్థ ఇప్పటివరకు ఆ ఫోన్లనయితే డెలివరీ చేయలేదు గానీ, అప్పుడే మరో సంచలన ప్రకటన మాత్రం చేసింది. ఎల్‌ఈడీ స్క్రీన్, హెచ్డీ రిజల్యూషన్తో ఇంతవరకు ఎవరూ ఊహించనంత తక్కువ ధరకు ఫ్రీడమ్ టీవీని గురువారం ఆవిష్కరించనున్నట్లు తెలిపింది. వాస్తవానికి ముందుగా బుక్ చేసుకున్న వినియోగదారులకు బుధవారమే ఫ్రీడమ్ 251 ఫోన్లు అందాల్సి ఉంది. కానీ అది మళ్లీ మళ్లీ వాయిదా పడుతూనే ఉంది. ఇదే అంశంపై గురువారం నాడు కంపెనీ ఎండీ మోహిత్ గోయల్ ఓ ప్రకటన కూడా చేస్తారని రింగింగ్ బెల్స్ తెలిపింది.

251 రూపాయలకు ఫోన్ ఇస్తామన్నవాళ్లు ఇక టీవీని మరెంత తక్కువ ధరకు ఇస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో ఫోన్ ఇవ్వడానికే ఇంత ఆలస్యం చేసి.. ఇన్ని వాయిదాలు వేసినవాళ్లు ఇక టీవీలు అందించడానికి ఇంకెంత ఆలస్యం చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. మరొక్క రోజు ఆగితే ఫ్రీడమ్ టీవీల విషయం కూడా తెలిసిపోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement