న్యూఢిల్లీ: దేశవ్యాప్త లౌక్‌డౌన్ నేపథ్యంలో సంబంధిత కాలంలో గడువు ముగిసే హెల్త్ పాలసీల రెన్యువల్‌కు ఈ నెల 21 వరకు గడువు పొడిగించాలని అన్ని బీమా సంస్థలను బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ కోరింది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ ఈ నెల 1నే నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసినట్టు తెలిపింది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 మధ్య గడువు ముగిసే పాలసీలకు ప్రీమియం చెల్లించలేని వారికి ఏప్రిల్ 21 వరకు అవకాశం ఇవ్వాలని సంబంధిత నోటిఫికేషన్‌లో కేంద్రం పేర్కొంది. అలాగే, వాహనదారులు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియం చెల్లింపునకు కూడా ఏప్రిల్ 21 వరకు గడువు పొడిగించాలని ఆదేశాల్లో కేంద్ర ప్రభుత్వం కోరింది.
Comments
Please login to add a commentAdd a comment