Insurance Regulatory and Development Authority
-
బీమా ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి
న్యూఢిల్లీ: బీమా ఒప్పందాల్లో అస్పష్టత, షరతులు అసౌకర్యంగా ఉండడం వంటి ఆరు అంశాలను కేంద్ర ప్రభుత్వం బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ), బీమా కంపెనీల ముందు ప్రస్తావించింది. వెంటనే వీటిని పరిష్కరించాలని, అపరిష్కృతంగా ఉన్న వినియోగదారుల కేసులను తగ్గించాలని బుధవారం ఢిల్లీలో జరిగిన సదస్సులో కోరింది. కోర్టు బయట పరిష్కారాల విషయమై బీమా కంపెనీల ప్రతినిధులకు అధికారాల్లేకపోవడం, వినియోగదారులతో ఒప్పందంపై సంతకం చేయించుకోవడానికి ముందు పాలసీకి సంంధించి అన్ని డాక్యుమెంట్లను అందించకపోవడం, ముందు నుంచీ ఉన్న వ్యాధుల పేరిట క్లెయిమ్‌లను తిరస్కరించడం, పంట బీమా క్లెయిమ్‌లను కేంద్ర పథకంతో ముడిపెట్టడాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించింది. ప్రస్తుతం దేశంలో వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదుల్లో 20 శాతానికి పైగా బీమా రంగానికి సంబంధించే ఉంటున్నాయనేది వాస్తవం ‘‘ఐఆర్డీఏఐ, ఇతర భాగస్వాముల (బీమా సంస్థలు, టీపీఏలు) వద్ద ఈ అంశాలను ప్రస్తావించాం. బీమా సంస్థలు స్వచ్చందంగా వీటిని పరిష్కరిస్తాయని ఆశిస్తున్నాం. అవసరనుకుంటే వీటిని తప్పనిసరి చేయాలని ఐఆర్‌డీఏఐని కోరతాం’’అని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ అంశాల వల్లే దేశవ్యాప్తంగా బీమాకు సంబంధించి పెద్ద మొత్తంలో ఫిర్యాదులు అపరిష్కృతంగా ఉన్నట్టు చెప్పారు. పరిశ్రమ 8 శాతం విస్తరణ రేటును చేరుకోవాలంటే, ఫిర్యాదులు పెద్ద ఎత్తున పెరిగిపోకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. బీమా పాలసీ నిబంధనలు, షరతులు సులభతరంగా, స్పష్టంగా, అర్థం చేసుకోతగిన భాషలో ఉంటే ఫిర్యాదులను తగ్గించొచ్చని అభిప్రాయపడ్డారు. నియమ నిబంధనలు, షరతులను పూర్తిగా అర్థం చేసుకోకుండా డాక్యుమెంట్‌పై సంతకం చేయరాదన్న అవగాహనను పాలసీదారుల్లో కాల్పించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. -
హెల్త్ పాలసీల రెన్యువల్‌కు 21 వరకు గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: దేశవ్యాప్త లౌక్‌డౌన్ నేపథ్యంలో సంబంధిత కాలంలో గడువు ముగిసే హెల్త్ పాలసీల రెన్యువల్‌కు ఈ నెల 21 వరకు గడువు పొడిగించాలని అన్ని బీమా సంస్థలను బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ కోరింది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ ఈ నెల 1నే నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసినట్టు తెలిపింది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 మధ్య గడువు ముగిసే పాలసీలకు ప్రీమియం చెల్లించలేని వారికి ఏప్రిల్ 21 వరకు అవకాశం ఇవ్వాలని సంబంధిత నోటిఫికేషన్లో కేంద్రం పేర్కొంది. అలాగే, వాహనదారులు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియం చెల్లింపునకు కూడా ఏప్రిల్ 21 వరకు గడువు పొడిగించాలని ఆదేశాల్లో కేంద్ర ప్రభుత్వం కోరింది. -
వ్యవసాయ బీమా వైపు చూడండి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బీమా బ్రోకర్లు, సాధారణ బీమా కంపెనీలు వ్యవసాయ బీమాకు ప్రాధాన్యతను పెంచాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ, డెవలప్మెంట్ అథారిటీ (ఐఆర్డీఏ) చైర్మన్ టి.ఎస్.విజయన్ సూచించారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, విపత్తు నిర్వహణకు అవసరమైన బీమా ఉత్పత్తుల విక్రయంపై దృష్టిసారించాలని అన్నారు. వ్యవసాయ బీమాలో సింహభాగం ప్రభుత్వ నిర్వహణలోనే ఉంది. అందుకే ఈ విభాగంలో అపార అవకాశాలున్నాయి అని చెప్పారు. శుక్రవారమిక్కడ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఐబీఏఐ) శిఖరాగ్ర సమావేశంలో ఆయన కీలకోపన్యాసం చేశారు. బీమా బ్రోకరేజి సంస్థల్లో పనిచేసే సిబ్బందికి ఇచ్చే శిక్షణలో ఎప్పటికప్పుడు కొత్త సిలబస్‌ను పరిచయం చేస్తున్నట్టు చెప్పారు. 100 శాతం ఎఫ్‌డీఐకి వ్యతిరేకం.. బీమా బ్రోకింగ్, పంపిణీ, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్(టీపీఏ) రంగంలో ఎఫ్‌డీఐలను ప్రస్తుతమున్న 26 శాతం నుంచి 100 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనకు తాము పూర్తి వ్యతిరేకమని ఐబీఏఐ స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయం అమలైతే బ్రోకింగ్ సమాజానికి హాని కలుగుతుందని ఐబీఏఐ ప్రెసిడెంట్ సోహన్‌లాల్ కడేల్ తెలిపారు. బీమా రంగం వృద్ధిలో బ్రోకర్ల పాత్ర కీలకంగా ఉందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న 35 లక్షల మంది బీమా ఏజెంట్లను బ్రోకరేజి సంస్థల కిందకు తేవాలని ఐఆర్‌డీఏను కోరుతున్నట్టు వెల్లడించారు. ఐబీఏఐలో ప్రస్తుత సభ్యుల సంఖ్య 315 ఉంది. 2012-13లో బ్రోకరేజ్ సంస్థల వ్యాపారం నాన్ లైఫ్ బీమాలో 24%, జీవిత బీమాలో 0.5 శాతం ఉంది.