మొబైల్లో ఇంటర్నెట్ జోరు.. | Internet user base to almost double to 600 million by 2020: Assocham | Sakshi
Sakshi News home page

మొబైల్లో ఇంటర్నెట్ జోరు..

Published Tue, Dec 6 2016 12:25 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

మొబైల్లో ఇంటర్నెట్ జోరు.. - Sakshi

మొబైల్లో ఇంటర్నెట్ జోరు..

2020 నాటికి యూజర్లు 60 కోట్లకు చేరే అవకాశం
ప్రస్తుతం నెట్ వాడకందార్లు 34.3 కోట్లే
ఇంటర్నెట్ పెరిగినా డిజిటల్ అక్షరాస్యత సవాలే: అసోచామ్

న్యూఢిల్లీ: దేశంలోని ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 2020 నాటికి 60 కోట్లకు చేరుతుందని పరిశ్రమ సమాఖ్య అసోచామ్ అంచనా వేసింది. దీనికి 4జీ, 3జీ మొబైల్ ఫోన్ల వినియోగం పెరుగుదలే కారణమని తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 34.3 కోట్లుగా ఉందని తెలిపింది. హైస్పీడ్ డేటా సర్వీసులు అందించడానికి, పబ్లిక్ వై-ఫైలను ఏర్పాటు చేయడానికి స్పెక్ట్రమ్ లభ్యత ఒక సవాలుగా మారిందని పేర్కొంది.

 80 లక్షల వై-ఫై హాట్‌స్పాట్లు కావాలి
అంతర్జాతీయంగా చూస్తే ప్రతి 150 మంది పౌరులకు ఒక వై-ఫై హాట్‌స్పాట్ అందుబాటులో ఉందని అసోచామ్ తెలిపింది. భారత్‌లో ఈ పరిస్థితులు రావాలంటే 80 లక్షల హాట్‌స్పాట్‌లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని, కాగా మన దేశంలో ప్రస్తుతం 31,000 హాట్‌స్పాట్స్ మాత్రమే ఉన్నాయని తెలిపింది. ఇక ఇండియాలో మొబైల్ కనెక్టివిటీ లేని గ్రామాలు 55,000కు పైగా ఉన్నాయని పేర్కొంది. ఇలాంటి ప్రాంతాల్లో మొబైల్ కనెక్టివిటీ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం వల్ల కమర్షియల్‌గా ఎలాంటి ఉపయోగం ఉండదని సర్వీస్ ప్రొవైడర్లకు భావించడం వల్ల అక్కడ మొబైల్ కనెక్టివిటీ లేదని వివరించింది.

 52 కోట్లకు స్మార్ట్‌ఫోన్ యూజర్లు: దేశంలో మొబైల్ ఫోన్ యూజర్ల సంఖ్య 100 కోట్లు దాటిందని అసోచామ్ పేర్కొంది. దీనిలో స్మార్ట్‌ఫోన్ యూజర్లు 24 కోట్ల మంది ఉన్నారని తెలిపింది. వీరి సంఖ్య 2020 నాటికి 52 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. భారత్‌లో ఒకవైపు స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరుగుతున్నా.. ఇంటర్నెట్ విస్తరిస్తోన్నా.. డిజిటల్ అక్షరాస్యత మాత్రం చాలా తక్కువ స్థారుులో ఉంది. పాలసీ సంబంధిత నిబంధనలు సహా నైపుణ్యాలు, అనుభవం, సాంకేతిక వంటి అంశాలకు చెందిన పలు సవాళ్ల వల్ల డిజిటల్ ఇండియా కార్యక్రమం అడ్డంకులను ఎదుర్కొంటోందని పేర్కొంది. స్థానిక భాషల్లో డిజిటల్ సర్వీసులు అందుబాటులో లేకపోవడమనే అంశం గురించి ఆలోచించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. డిజిటల్ ఇన్‌ఫ్రా ఏర్పాటుకు ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలతో జతకట్టడం తప్పనిసరని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement