2024లో మరింత వేగంగా భారత్ వృద్ధి - అసోచామ్ | India Fastest Growing Economy In 2024 | Sakshi
Sakshi News home page

2024లో మరింత వేగంగా భారత్ వృద్ధి - అసోచామ్

Published Thu, Dec 28 2023 7:40 PM | Last Updated on Thu, Dec 28 2023 8:29 PM

India Fastest Growing Economy In 2024 - Sakshi

ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో అగ్రగామిగా ఉన్న భారత్ 2024లో కూడా అత్యంత వేగంగా అభివృద్ధి చెందనున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని అసోచామ్ ఈ రోజు (గురువారం) ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

రైల్వేలు, విమానయానం, అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీతో సహా నిర్మాణం, ఆతిథ్యం, మౌలిక సదుపాయాలు వంటి రంగాలలో పెట్టుబడులు పెరగడానికి దారితీసే బలమైన వినియోగదారుల డిమాండ్ నేపథ్యంలో 2024లో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని అసోచామ్ వెల్లడించింది.

2023 జులై - సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రభుత్వ వ్యయం మాత్రమే కాకుండా తయారీ పరంగా బూస్టర్ షాట్‌లతో GDP ఊహించిన దానికంటే వేగంగా 7.6 శాతం వృద్ధి చెందడంతో భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందింది. దీంతో ఆర్థిక వ్యవస్థ మరింత పెరుగుతుందని, మెరుగైన అవకాశాలు లభిస్తాయని అసోచామ్ సెక్రటరీ జనరల్ 'దీపక్ సూద్' అన్నారు.

ఇదీ చదవండి: ఇషితా సల్గావ్కర్ ఎవరు.. అంబానీతో సంబంధం ఏంటి?

భారతదేశ GDP వృద్ధి జూలై-సెప్టెంబర్‌లో చైనా కంటే ఎక్కువైనట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆర్థిక, నిర్మాణ, హోటళ్లు, ఏవియేషన్, ఆటో, ఎలక్ట్రానిక్స్ వంటి తయారీ రంగాల ఆధ్వర్యంలో దేశీయ కంపెనీల పనితీరు మరింత మెరుగుపడనుందని అసోచామ్ సెక్రటరీ అభిప్రాయపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement