సాక్షి,న్యూఢిల్లీ: ఐఆర్‌సీటీసీ (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్) పేరు మారబోతోందా? కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ తాజా వ్యాఖ్యలు ఈ అంచనాలను బలపరుస్తున్నాయి. ఐఆర్‌సీటీసీ కంటే మరింత ఆకట్టుకునే, సులువైన పేరు కోసం చూస్తున్నామని కేంద్రమంత్రి తెలిపారు. ఆకర్షణీయంగా , గుర్తుంచుకునేలా కొత్త పేరు ఉండాలని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాచీగా ఉండేలా కొత్త పేరును సూచించాలని రైల్వే శాఖను కోరారు.
ఐఆర్‌సీటీసీ పేరును గుర్తుంచుకోవడం కొన్నిసార్లు తనకే కష్టంగా మారిందని గోయల్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేసేటప్పుడు అనుకూలమైన సులభమైన పేరు ఉంటే బావుంటుంది, ఈ మేరకు ప్రతిపాదనలు సూచనలతోరావాలని గురువారం రైల్వే శాఖకు కోరినట్టుతెలిపారు. దీనిపై రైల్వే శాఖ అపుడే కసరత్తు మొదలుపెట్టింది. ‘రైల్ ట్రావెల్’ అయితే బావుంటుందని రైల్వే అధికారి సూచించారట అయితే కొత్త పేరుపై తుది నిర్ణయం ఎపుడు తీసుకుంటారు, ఎప్పటినుంచి అమల్లోకి రానుంది అనేది స్పష్టత లేదు. రైల్వే శాఖ తుది జాబితా అందించిన తరువాత పేరును ఫైనల్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
కాగా పండుగ సీజన్ నేపథ్యంలో రైలు టికెట్లపై ఐఆర్‌సీటీసీ 10 శాతం డిస్కౌంట్ ఆఫర్‌ను ఇటీవల ప్రకటించింది. ‘మొబీక్విక్’ చెల్లింపుల ద్వారా రైలు టికెట్ బుక్ చేసినప్పుడు 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే, పేటీఎం కూడా తమ గేట్‌వే ద్వారా టికెట్ బుక్ చేసుకునే వినియోగదారులకు రూ.100 వరకు క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఫోన్‌పే కూడా రూ.100 క్యాష్‌బ్యాక్ ఇస్తుంది. దీనితోపాటు మొదటి రెండు ట్రాన్సాక్షన్లకు రూ.50 రాయితీ అందిచనున్నామని వెల్లడించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment