ఈ దెబ్బకు యూనియన్ గా ఐటీ ఉద్యోగులు | IT employees set to form union as layoffs loom large | Sakshi
Sakshi News home page

ఈ దెబ్బకు యూనియన్ గా ఐటీ ఉద్యోగులు

Published Tue, May 23 2017 6:55 PM | Last Updated on Tue, Sep 5 2017 11:49 AM

ఈ దెబ్బకు యూనియన్ గా ఐటీ ఉద్యోగులు

ఈ దెబ్బకు యూనియన్ గా ఐటీ ఉద్యోగులు

బెంగళూరు : దేశంలో అతిపెద్ద ఇండస్ట్రి ఐటీ ఉద్యోగులకు ఇప్పటివరకు యూనియన్లు లేవు. కానీ ఇటీవల భారీ ఎత్తున్న కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తుండటంతో ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం కచ్చితంగా యూనియన్లను ఏర్పాటుచేసుకోవాలని నిర్ణయించారు. ఐటీ వర్కర్ల ఫోరమ్ దేశంలో టెకీల కోసం  తొలి యూనియన్ గా రిజిస్ట్రర్ అయ్యేందుకు సిద్ధమైంది. భారతదేశంలో ఐటీ ఉద్యోగుల తొలి యూనియన్ గా అధికారికంగా ఫోరమ్ ఫర్ ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్(ఎఫ్ఐటీఈ)ని నమోదుచేసుకుంటుందని  ఫోరమ్ వైస్ ప్రెసిడెంట్ వసుమతి చెప్పారు. వచ్చే ఐదు నెలల్లోనే తొలి యూనియన్ ఏర్పాటవుతుందని పేర్కొన్నారు. మేజర్ ఐటీ కంపెనీలు  ఏకపక్షంగా ఉద్యోగులను భారీ ఎత్తున్న తీసేస్తుండటంతో ఈ యూనియన్ ను ఏర్పాటుచేస్తున్నట్టు తెలిసింది.
 
ఎఫ్ఐటీఈలో 1000 పైగా ఆన్ లైన్ మెంబర్లు, 100కి పైగా క్రియాశీలక సభ్యులున్నారు. తొమ్మిది నగరాలు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణే, ముంబై, కొచ్చి, ఢిల్లీలో ఇది చాప్టర్స్ ను ప్రారంబించింది. గతంలో కూడా ఈ ఫోరమ్ ఐటీ ఉద్యోగులను అన్యాయపూర్వకంగా తొలగిస్తున్న సందర్భంగా పోరాటాలు చేసింది. వచ్చే మూడేళ్లలో 1.75 లక్షల నుంచి 2 లక్షల మేర ఉద్యోగాల కోత ఉంటుందని  ఇప్పటికే పలు సర్వేలో అంచనాలు విడుదల చేస్తున్నాయి.

కంపెనీలు కూడా ఏకపక్షంగా, లాభాపేక్షతో ఉద్యోగులను బయటికి పంపేస్తున్నాయని వసుమతి ఆరోపించారు. ఉద్యోగాల కోత తాత్కాలికంగా లాభాల మార్జిన్లను పెంచినా.. పరిశ్రమకు దీర్ఘకాలంగా మాత్రం భారీ దెబ్బనే తగలనుందని అభిప్రాయం వ్యక్తంచేశారు. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం కంపెనీలు లాభాలార్జించడానికి ఉద్యోగులపై వేటు వేసే హక్కు లేదని ఎఫ్ఐటీఈ సభ్యుడు జయప్రకాశ్ తెలిపారు. నష్టాలు వచ్చేటప్పుడే కంపెనీలు  ఉద్యోగులపై వేటు వేస్తుంటాయని పేర్కొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement