జబాంగ్ బిగ్గెస్ట్ సేల్ ఈవెంట్: భారీ డిస్కౌంట్లు
జబాంగ్ బిగ్గెస్ట్ సేల్ ఈవెంట్: భారీ డిస్కౌంట్లు
Published Sat, Jul 29 2017 1:13 PM | Last Updated on Tue, Sep 5 2017 5:10 PM
ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ గత రెండు నెలలుగా సేల్ ఈవెంట్లతో వినియోగదారులను మైమరపించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఆన్‌లైన్ ఫ్యాషన్ మార్కెట్ ప్లేస్ జబాంగ్ కూడా అతిపెద్ద సేల్ ఈవెంట్‌ను ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఈ సైట్ ''బిగ్ బ్రాండ్ సేల్'' ను లాంచ్ చేసింది. నేటి(జూలై 29) నుంచి జూలై 31 వరకు అంతర్జాతీయ, జాతీయ బ్రాండులపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. అడిడాస్, లెవిస్, ప్యూమా, జాక్ అండ్ జోన్స్, యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనెట్టన్ వంటి బ్రాండ్లపై 40 శాతం నుంచి 71 శాతం వరకు తగ్గింపును జబాంగ్ అందిస్తోంది. అదనంగా ఎస్‌బీఐ కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్, మొబిక్‌విక్‌లపై 10 శాతం క్యాష్ బ్యాక్‌ను జబాంగ్ ప్రకటించింది. ప్రతిరోజు జబాంగ్ నిర్వహించే కంటెస్ట్‌తో గెలుపొందిన వారు మలేషియాను ఉచితంగా సందర్శించే అవకాశాన్ని కల్పిస్తోంది.
ఈ సేల్‌తో రెవెన్యూల్లో గణనీయమైన వృద్ధిని నమోదుచేయాలని జబాంగ్ ఆశిస్తోంది. ఈ సేల్‌ను ప్రమోట్ చేయడం కోసం పలు సెలబ్రిటీలతో డీల్స్‌పై ప్రచారం కూడా నిర్వహిస్తోంది. ''మా అతిపెద్ద బ్రాండ్ సేల్‌ను నిర్వహించడానికి ఎంతో ఆసక్తికరంగా వేచిచూస్తున్నాం. రూ.400 కోట్ల విలువైన ఉత్పత్తులను దీనిలో అందిస్తున్నాం. జూలై 29వ తేదీ అర్థరాత్రి నుంచి ఈ సేల్‌ను ప్రారంభిస్తున్నాం. ఇప్పటికే ఈ సేల్ గురించి పలు బ్రాండ్ల సీఈవోలు, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. యువరాజ్ సింగ్, షాజ్‌మీన్‌లు వైడబ్ల్యూసీ బ్రాండును, బింద్రా బిబాను ప్రమోట్ చేస్తున్నారు'' అని కంపెనీ తెలిపింది.
Advertisement
Advertisement