
ముంబై: ప్రైవేట్ విమానయాన సంస్థ ‘జెట్ ఎయిర్‌వేస్’ నికర లాభం (స్డాండోలోన్) ఈ ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో 91 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.549 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.50 కోట్లకు తగ్గిందని జెట్ ఎయిర్‌వేస్ తెలిపింది. ఇతర ఆదాయం భారీగా పడిపోవడంతో నికర లాభం ఈ స్థాయిలో క్షీణించిందని జెట్ ఎయిర్‌వేస్ సీఈఓ వినయ్ దుబే చెప్పారు.
మొత్తం అమ్మకాలు రూ.5,773 కోట్ల రూ.5,758 కోట్లకు తగ్గాయని తెలిపారు. ఇతర ఆదాయం రూ.320 కోట్ల నుంచి రూ.132 కోట్లకు తగ్గిందని పేర్కొన్నారు. ఈ క్యూ2లో తమ విమాన సర్వీసుల ద్వారా ప్రయాణించిన వారి సంఖ్య 8 శాతం వృద్ధితో 73 లక్షలకు పెరిగిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment