జేఎల్‌ఆర్‌ ధరలు తగ్గాయ్‌.. | JLR prices declined | Sakshi
Sakshi News home page

జేఎల్‌ఆర్‌ ధరలు తగ్గాయ్‌..

Published Mon, Apr 24 2017 12:38 AM | Last Updated on Tue, Sep 5 2017 9:31 AM

జేఎల్‌ఆర్‌ ధరలు తగ్గాయ్‌..

జేఎల్‌ఆర్‌ ధరలు తగ్గాయ్‌..

న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) రెండు మోడళ్ల కార్ల ధరలను రూ.4.08 లక్షల వరకు తగ్గించింది. ల్యాండ్‌ రోవర్‌ డిస్కవరీ స్పోర్ట్‌ డీజిల్‌ రకం మోడల్‌ ధరను రూ.4.08 లక్షలు తగ్గించడంతో రూ.43.8లక్షలకు తగ్గింది.

ఇంతకుముందు ఢిల్లీ ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ.47.88 లక్షలు. రేంజ్‌ రోవర్‌ ఎవోక్వ్‌ డీజిల్‌ మోడల్‌ ధరను రూ.3.25 లక్షలు తగ్గించడంతో దీని ధర రూ.49.10 లక్షల నుంచి రూ. 45.85 లక్షలకు (ఢిల్లీ ఎక్స్‌ షోరూమ్‌ ధర) దిగొచ్చింది. ల్యాండ్‌రోవర్‌ కార్లకు ఆదరణ పెరుగుతున్న దృష్ట్యా దీన్ని మరింత మందికి చేరువ చేసే ఉద్దేశ్యంతో కార్ల ధరలను తగ్గించినట్టు జేఎల్‌ఆర్‌ ఇండియా ఎండీ రోహిత్‌ సూరి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement