![Job aspirants explore flexible career opportunities - Sakshi](/styles/webp/s3/article_images/2017/12/26/Work-from-home.jpg.webp?itok=z6fQ3Ikd)
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో ఉద్యోగాలు ఆశించేవారిలో అత్యధికులు వీలైన పనివేళలను, ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటును కోరుతున్నారని ఓ నివేదిక స్పష్టం చేసింది. భారత్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం సెర్చి చేసిన వారి సంఖ్య 2017లో 111 శాతం పెరిగిందని ఇండీడ్ నిర్వహించిన వార్షిక అథ్యయనంలో వెల్లడైంది. మెరుగైన వేతన ప్యాకేజ్‌లతో, వెసులుబాటు కలిగిన పనివేళలతో కంపెనీలు జాబ్ ఆఫర్‌లతో ముందుకొస్తున్న క్రమంలో అభ్యర్థులూ తమకు వీలైన పనివేళలు, వర్క్ ఫ్రం హోమ్‌వైపు మొగ్గుచూపుతున్నారని, ఖాళీ సమయాల్లో వ్యక్తిగత ఎదుగుదలకు ప్రయత్నిస్తున్నారని ఈ అథ్యయనంలో తేలింది.
2017లో డిజిటల్ మార్కెటింగ్, ప్రభుత్వ, సాంకేతిక సంబంధిత ఉద్యోగాల కోసం అన్వేషణ కూడా గణనీయంగా పెరిగిందని పేర్కొంది. మారుతున్న ధోరణుల కారణంగా మెషిన్ లెర్నింగ్, డేటా సైంటిస్ట్, డేటా అనలిటిక్స్‌లో ఉద్యోగాల వేట పెరిగిందని నివేదిక పేర్కొంది.
ఈ ఏడాది పార్మ రంగంలో జాబ్ సెర్చి 40 శాతం తగ్గగా, ఆయుర్వేద విభాగంలో 56 శాతం వృద్ధి కనబరచడం గమనార్హం. టెక్నాలజీ రంగంలో అవకాశాలు పెరిగినా ప్రభుత్వ ఉద్యోగాల కోసం జాబ్ సెర్చికి విపరీతమైన డిమాండ్ నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ ఉద్యోగాలకు అమితాదరణ నెలకొన్నా భారత్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం అభ్యర్థులు అర్రులుచాస్తున్నారని నివేదిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment