బెంగళూరు: ప్రముఖ క్యాబ్ సర్వీసెస్ సంస్థ 'ఓలా'కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నిబంధనలను అతిక్రమించినందుకుగాను ఆ సంస్థ లైసెన్స్‌లను ఆరు నెలలు రద్దు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కర్ణాటకలో ఆరు నెలలు ఈ సంస్థ సర్వీసులు నిలిచిపోనున్నాయి. రూల్స్‌ను అతిక్రమించి ఎలాంటి అనుమతులు లేకుండానే ఓలా బైక్ ట్యాక్సీని నడుపుతుందని కర్ణాటక రవాణ శాఖ తెలిపింది.
దీనిపై వివరణ కోరామని.. అయితే సంస్థ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని వివరించింది. దీంతో కర్టాటక రవాణ చట్టం 2016 ప్రకారం ఆ సంస్థ లైసెన్స్‌లను ఆరు నెలలు రద్దు చేస్తున్నట్లు ఆదేశాలను జారీ చేశారు. ఈనెల 18వ తేదీనే ఆదేశాలను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆర్డర్ కాపీ అందిన మూడు రోజుల్లోనే లైసెన్సును సరెండర్ చేయాలని కూడా ఓలా కంపెనీని ఆదేశించారు. దీంతో ఓలా క్యాబ్స్ కర్ణాటక రోడ్లపై ఆరు నెలలు కనిపించవని ఆ శాఖ ఉన్నతాధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment