కేజీ బేసిన్‌లో కెయిర్న్ రూ.13 వేల కోట్ల పెట్టుబడులు | KG basin In the Cairn Rs 13 crore Investments | Sakshi
Sakshi News home page

కేజీ బేసిన్‌లో కెయిర్న్ రూ.13 వేల కోట్ల పెట్టుబడులు

Published Mon, Feb 9 2015 2:06 AM | Last Updated on Sat, Sep 2 2017 9:00 PM

కేజీ బేసిన్‌లో కెయిర్న్ రూ.13 వేల కోట్ల పెట్టుబడులు

కేజీ బేసిన్‌లో కెయిర్న్ రూ.13 వేల కోట్ల పెట్టుబడులు

హైదరాబాద్: చమురు, సహజవాయువు ఉత్పత్తిలో ఉన్న కెయిర్న్ ఇండియా కృష్ణ-గోదావరి బేసిన్‌లో ఆయిల్, గ్యాస్ బ్లాక్ అభివృద్ధికి సుమారు రూ.13,000 కోట్లు వెచ్చించనుంది. కేజీ-ఓఎస్‌ఎన్-2009/3 బ్లాక్‌లో 64 బావుల్లో తవ్వకాలు చేపట్టేందుకై ప్రాజెక్టు ప్రణాళిక సిద్ధం చేసేందుకు కంపెనీ కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరింది. ఈ బ్లాక్ ప్రకాశం, గుంటూరు తీరం వెలుపల బంగాళాఖాతంలో నిక్షిప్తమై ఉంది. తీరం వెలుపల క్షేత్రం ఉన్నందున ప్రజాభిప్రాయ సేకరణ అవసరం లేదని పర్యావరణ  శాఖకు చెందిన ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ తన నివేదికలో వెల్లడించింది. కేజీ-ఓఎస్‌ఎన్-2009/3 బ్లాక్‌ను కెయిర్న్ ఇండియా 2010లో దక్కించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement