లాంకో ఇన్ఫ్రా షేరు ఢమాల్
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలతో లాంకో ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ షేర్లు భారీగా పతనమవుతున్నాయి. బ్యాంకులకు వేల కోట్లు బకాయిపడ్డ దివాలా ముంగిట నిలిచిన దేశీయ మౌలిక రంగ సంస్థ ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్ రికార్డ్ పతనాన్ని నమోదు చేసింది సోమవారం నాటి మార్కెట్ ఆరంభలోనే 8.5 శాతం నష్టపోయాయి. అనంతరం మరింత దిగజారి 17.02శాతం కుదేలైంది. ప్రస్తుతం 20 శాతం నష్టపోయి రూ. 1 వద్ద ట్రేడ్ అవుతూఆల్‌టైం కనిష్టాన్ని నమోదు చేసింది.. శుక్రవారం నాటి ముగింపుతో పోలిస్తే 12 నెలల్లో స్టాక్ 50 శాతానికిపైగా పడిపోయింది.
కాగా భారీ రుణాలు తీసుకుని, తీర్చలేక డిఫాట్లర్‌గా నిలిచిన సంస్థనుంచి భారీ రుణాలు రికవరీ చేసేందుకు దివాలా చట్టం ప్రకారంగా చర్యలు ప్రారంభించాలని శనివారం ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. దీన్లో భాగంగానే ల్యాంకోకు రుణాలిచ్చిన ఐడీబీఐ బ్యాంకుకు... ఆర్‌బీఐ శనివారం ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకుల కన్సార్టియానికి నేతృత్వం వహిస్తున్న ఐడీబీఐ బ్యాంక్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసిందని ల్యాంకో ఇన్‌ఫ్రా కూడా శనివారం వెల్లడించింది.దివాలా, బ్యాంక్రప్సీ కోడ్ (ఐబీసీ) కింద ల్యాంకోపై చర్యలు ఆరంభించాలంటూ లీడ్ బ్యాంకరు ఐడీబీఐ బ్యాంక్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆదేశించిన సంగతి తెలిసిందే.
,