ర్యాన్‌బాక్సీ లిపిటార్ జనరిక్ ఔషధం రీకాల్
న్యూఢిల్లీ: ర్యాన్‌బాక్సీ మరో వివాదంలో చిక్కుకుంది. డోసేజీల్లో తేడాలున్న ఆరోపణలు రావడంతో అమెరికాలో 64,000 పైచిలుకు అటోర్‌వాస్టాటిన్ క్యాల్షియం ట్యాబ్లెట్ల బాటిళ్లను రీకాల్ చేసింది. కొలెస్ట్రాల్‌ను తగ్గించే లిపిటార్ ఔషధానికి ఇది జనరిక్ వెర్షన్. పది మిల్లీగ్రాముల ట్యాబ్లెట్స్ ఉండాల్సిన బాటిల్లో 20 మిల్లీగ్రాముల ట్యాబ్లెట్లు ఉన్నాయని అమెరికాలో ఒక ఫార్మాసిస్టు ఫిర్యాదు చేయడంతో కంపెనీ తాజా రీకాల్ చేపట్టింది. అధిక డోసేజీ మాత్రలుండే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నప్పటికీ.. తాము 2 లాట్లకు సంబంధించి స్వచ్ఛందంగా రీకాల్ చేపట్టినట్లు తెలిపింది.
ఔషధాల తయారీలో ప్రమాణాలు పాటించకపోవడం ఆరోపణలపై అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ ర్యాన్‌బాక్సీకి చెందిన పలు ప్లాంట్లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.