ఇష్యూ ధరకు 28% ప్రీమియమ్‌తో లిస్టింగ్
24 శాతం లాభంతో ముగింపు
ముంబై: మాహానగర్ గ్యాస్ స్టాక్ మార్కెట్ లిస్టింగ్‌లో మెరుపులు మెరిపించింది. ఇష్యూధర (రూ.421)తో పోల్చితే 28 శాతం ప్రీమియమ్‌తో రూ.540 వద్ద బీఎస్‌ఈలో లిస్టయింది. రూ.518-549 కనిష్ట, గరిష్ట స్థాయిల మధ్య కదలాడి చివరకు ఇష్యూధర(రూ.421)తో పోల్చితే 23.4 శాతం లాభంతో రూ.520 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో 38.11 లక్షలు, ఎన్‌ఎస్‌ఈలో 2 కోట్ల చొప్పున షేర్లు ట్రేడయ్యాయి. గత వారంలోనే వచ్చిన మహానగర్ గ్యాస్ ఐపీఓ 65 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. భారత్‌లో రెండో అతి పెద్ద సీఎన్‌జీ రిటైల్ కంపెనీ అయిన మహానగర్ గ్యాస్‌ను గెయిల్, బ్రిటిష్ గ్యాస్ ఏషియా పసిఫిక్ హోల్డింగ్స్‌లు ప్రమోట్ చేస్తున్నాయి. మహానగర్ గ్యాస్ కంపెనీ ముంబై పరిసర ప్రాంతాల్లో కంప్రెస్‌డ్ నేచురల్ గ్యాస్(సీఎన్‌జీ), పైప్‌డ్ నేచురల్ గ్యాస్(పీఎన్‌జీ)లను సరఫరా చేస్తోంది.