మహీంద్రా నుంచి బిగ్ బొలెరో పికప్ | Mahindra launches new Bolero pick-up | Sakshi
Sakshi News home page

మహీంద్రా నుంచి బిగ్ బొలెరో పికప్

Published Thu, Apr 28 2016 1:34 AM | Last Updated on Sun, Sep 3 2017 10:53 PM

బిగ్ బొలెరో పికప్ వాహనాన్ని ఆవిష్కరిస్తున్న కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్) జ్యోతి మల్హోత్రా   (ఎడమ వ్యక్తి)

బిగ్ బొలెరో పికప్ వాహనాన్ని ఆవిష్కరిస్తున్న కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్) జ్యోతి మల్హోత్రా (ఎడమ వ్యక్తి)

1.5 టన్నుల సామర్థ్యం  ధర రూ. 6.34-6.49 లక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆటోమొబైల్స్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) కొత్తగా బిగ్ బొలెరో పికప్ వాహనాలను బుధవారం ఆవిష్కరించింది. వీటి గరిష్ట సామర్ధ్యం 1.5 టన్నులు కాగా, కార్గొ బాడీ పొడవు తొమ్మిది అడుగుల మేర ఉంటుంది. బీఎస్ త్రీ, బీఎస్ ఫోర్ ప్రమాణాలతో ఇవి లభిస్తాయి. ధర రూ. 6.34 లక్షల నుంచి రూ. 6.49 లక్షలు (ఎక్స్‌షోరూం హైదరాబాద్) దాకా ఉంటుందని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్) జ్యోతి మల్హోత్రా బుధవారం ఇక్కడ జరిగిన పికప్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా తెలిపారు. వ్యాపారస్తుల పికప్ వాహనాల అవసరాలను అధ్యయనం చేసి, బిగ్ బొలెరో పికప్‌ను రూపొందించినట్లు ఆయన చెప్పారు.

ఫ్లాట్ బెడ్‌తో పాటు కస్టమర్లు తమ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకునేలా సీబీసీ (కౌల్ బాడీ చాసిస్) వేరియంట్‌లో కూడా ఇది లభిస్తుందన్నారు. ప్రస్తుతం పికప్ విభాగంలో దేశవ్యాప్తంగా తమకు 69 శాతం మార్కెట్ వాటా ఉందని ఆయన వివరించారు. తెలుగురాష్ట్రాల్లో సుమారు 89 శాతం వాటా ఉండగా, ఇందులో సింహ భాగం 83 శాతం వాటా బొలెరోది కాగా మిగతా భాగం ఇంపీరియోది ఉన్నట్లు పేర్కొన్నారు. ఏడాది వ్యవధిలో ఇప్పటిదాకా సుమారు 10 కొత్త వాహనాలను ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement