ముంబై : దేశీయ ఆటో దిగ్గజం మహింద్రా అండ్ మహింద్రా గ్రాడ్యుయేట్ల నియామకాలపై దృష్టిసారించింది. ఇంజనీరింగ్, బిజినెస్ స్కూళ్ల ద్వారా 2018లో 300 మంది గ్రాడ్యుయేట్లను తన కంపెనీలోకి తీసుకోవాలని యోచిస్తోంది. గతేడాది కూడా క్యాంపస్‌ల నుంచి ఇంతే మొత్తంలో నియామకాలను చేపట్టింది. వీరిలో ఎక్కువ మందిని ఇంజనీర్లనే నియమించుకుంది. డిజైన్స్, కొత్త టెక్నాలజీలు(ఎక్కువగా ఆటోమేషన్), ఎలక్ట్రిక్ వాహనాలపై పనిచేయడానికి వీరిని నియమించింది. అన్ని టీమ్‌ల్లో తాము ఎక్కువగా ఎలక్ట్రిక్ వెహికిల్ సొల్యూషన్ కోసం నియామకాలు చేపడుతున్నామని, కంపెనీ ఎక్కువగా దృష్టిసారించిన ప్రాంతంలో ఇదీ ఒకటని చీఫ్ పీపుల్ ఆఫీసర్ రాజేశ్వర్ త్రిపాఠి చెప్పారు.
ఈ ఏడాది 600 మంది నుంచి 700 మందిని తీసుకోవాలని కంపెనీ భావిస్తోందని, ఈ నియామకాలు ఎక్కువగా క్యాంపస్ రిక్రూట్‌మెంట్, భర్తీ నియామకాల ద్వారా ఉంటాయన్నారు. ఇప్పటికే మహింద్రా అండ్ మహింద్రాలో 22వేల మంది స్టాఫ్ ఉన్నారు. వారిలో కనీసం 16వేల మంది బ్లూ-కాలర్ ఉద్యోగులే. పలు కార్యకలాపాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, రోబోటిక్స్ వంటి కొత్త టెక్నాలజీలను చేర్చుతోంది. మహింద్రా అండ్ మహింద్రాలో మహిళా ఉద్యోగులు మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 20 శాతం మంది ఉన్నారు. ఈ వైవధ్యాన్ని మెరుగుపర్చేందుకు తాము కృషిచేస్తున్నామని కంపెనీ చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment