ఎంఎస్టీసీతో మహీంద్రా జట్టు...
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ సంస్థ ‘ఎంఎస్‌టీసీ’తో మహీంద్రా గ్రూప్‌కు చెందిన ‘మహీంద్రా ఇంటర్‌ట్రేడ్’ సంస్థ జతకట్టింది. ఇరు సంస్థల నడుమ ఒప్పందం ప్రకారం.. ఇవి జాయింట్ వెంచర్ ద్వారా దేశంలో ‘ఆటో ష్రెడ్డింగ్ అండ్ రీసైక్లింగ్ ప్లాంట్’ను ఏర్పాటు చేస్తాయి. ‘దేశంలో ఆటో స్క్రాప్ పదార్థాల వినియోగం సంవత్సరానికి 5-6 మిలియన్ టన్నులుగా ఉంది. దీని మార్కెట్ రూ.12,000 కోట్లుగా ఉండొచ్చని అంచనా.